ఘనంగా ఆంజనేయుడికి పూజలు


Wed,May 15, 2019 12:05 AM

యాదాద్రి భువనగిరిజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. ఈ క్షేత్రానికి పాలకుడిగా చెంత గల గుడిలో హనుమంతుడిని సిందూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో శ్రీలక్ష్మీనరసింహుల నిత్యకళ్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తొలుత శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు శ్రీస్వామి అమ్మవారుల ఆశీస్సులు అందజేశారు. నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్య కల్యాణం నిర్వహించారు.

శ్రీవారి ఖజానాకు రూ.7,56,243 ఆదాయం
శ్రీవారికి ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ. 90,668, 100 రూపాయల దర్శనం టికెట్‌తో రూ.59,900, వ్రత పూజలతో రూ. 48,500, ప్రసాద విక్రయాలతో రూ.3,65,860, విచారణ శాఖతో రూ. 58,310 ఇతర విభాగాల నుంచి రూ. 88,814తో పాటు మిగతా అన్ని విభాగాల నుంచి రూ. 7,56,243 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆదాయశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయాధికారులు దోర్భల భాస్కర్‌, వేముల రామ్మోహన్‌, మేడి శివకుమార్‌, జూశెట్టి కృష్ణాగౌడ్‌, డి.సురేందర్‌రెడ్డి, గజ్వేల్‌ రమేశ్‌బాబు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...