ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే


Tue,May 14, 2019 04:00 AM

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తేరా గెలుపు ఖాయం
-మూడు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంటాం
-విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

నీలగిరి: రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే గెలుపని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సంస్థల శాసన మండలి నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తేర చిన్నపరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల మద్దతుతో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని చాటి చెప్పారన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మద్దతు లభిస్తుందని, ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు జిల్లా పరిషత్‌లపై టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగుర వేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. గతంలో 200 ఓట్లు విపక్ష పార్టీలకు ఉండటం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగిందన్నారు. ఎన్నికల అనంతరం జిల్లాలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలో ఉన్న వారంతా టీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. జిల్లాలో 12 ఎమ్మెల్యేలకు గాను 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలను టీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తేర చిన్నపరెడ్డి విజయం ఖాయమని తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి తేర చిన్నపరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల కంటే టీఆర్‌ఎస్ మరింత బలమైన శక్తిగా ఎదిగిందని , అందరి సహకారంతో ఎన్నికల్లో గెలువడం ఖాయమన్నారు.

బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రబాకర్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ నియోజక వర్గ ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డి, ఐసీడీఎస్ ఆర్‌వో మాలే శరణ్యారెడ్డి, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...