టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి


Mon,May 13, 2019 02:26 AM

ఆత్మకూరు(ఎం): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కప్రాయిపల్లి, కొరటికల్, ఉప్పలపహడ్, టి.రేపాక, మోదుగుకుంట, చిన్నగూడెం, మొరిపిరాల గ్రామాల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జడ్పీటీసీగా బీసు చందర్‌గౌడ్, కఫ్రాయిపల్లి, కొరటికల్ ఎంపీటీసీలుగా ఏనుగు సోమలక్ష్మి, సోలిపురం రేణుకకు కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేనివిధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల నుంచి రూ.1000 ఫించన్, 2000, 3000 ఇవ్వడంతో పాటు 57 ఏండ్లు నిండిన అర్హులైన వారందరికీ పెన్షన్‌లు, రైతుబంధు కింద ఎకరానికి రూ.5 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉప్పలపహడ్ నుంచి మోదుగుబావి గూడెంకు బీటీ రోడ్డు మంజూరి చేయిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కాంబోజుభాగ్యశ్రీ, వైస్ ఎంపీపీ ఏనుగు దయాకర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు తిర్మల్‌రెడ్డి, సత్తయ్య, మాధవి, ప్రమీల, లలిత, సరితతో పాటు టీఆర్‌ఎస్ జిల్లా, మండల నాయకులు గడ్డమీది రమేశ్‌గౌడ్, భానుప్రకాశ్, అంజిరెడ్డి, సోమిరెడ్డి, వెంకట్‌రెడ్డి, పురుషోత్తం, దశరథ, స్వామి, రాజు, రంగారెడ్డి, నాగరాజు, ఉదయ్, మల్లయ్య, లక్ష్మయ్య, కృష్ణస్వామి, బాలరాజు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి- తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
అడ్డగూడూరు :సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది ,సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలకేంద్రంతో పాటు కోటమర్తి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈసంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జరగిన ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారని అలాగే ఈనెల 14 తేదిల్లో జరిగే పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్దిని ముందుకు తీసుకెళ్ళాలని కోరారు. మండలంలోని 7 ఎంపీటీసీ స్థానాలను ,ఒక జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోని అడ్డగూడూరు గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని అన్నారు.మండలాన్ని ఇచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే మండలాభివృద్ది చేసేది కూడ టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఓర్సు లక్ష్మి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పొన్నాల వెంకటేశ్వర్లు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్,రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి శ్రీరాముల జ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థులు పాశం రాణి, చిప్పలపల్లి అరుణ పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...