కాంగ్రెస్ దేశానికి పట్టిన శని


Mon,May 13, 2019 02:24 AM

మోత్కూరు : కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని అని దానిని తరిమి కొట్టవలసిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పనకబండ, రాగిబావి, ముశిపట్ల, పాలడుగు గ్రామాల్లో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గుండాల మండలానికి చెందిన అండెం సంజీవరెడ్డి గత ఎన్నికల్లో అక్కడి మండల ప్రజలే తిరస్కిరించారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో సంజీవరెడ్డి ఆయన భార్య సుమన ను మోత్కూరు నుంచి జడ్పీటీసీగా పోటీ చేసినా.. ఆయన మోత్కూరు మండలాన్ని అభివృద్ధి చేస్తానంటే నమ్ముతారా..? అని ప్రశ్నించారు. మన మండలం, మన ఊరు, మన బతుకులు బాగు పడాలంటే మన మండలానికి చెందిన టీఆర్‌ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కొణతం యాకూబ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పొన్నేబోయిన రమేశ్, జడ్పీటీసీ అభ్యర్థి గొరుపల్లి శారద- సంతోష్‌రెడ్డి, ఎంపీపీ అభ్యర్థి రచ్చ కల్పన లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ విష్ణు, సర్పంచులు రాంపాక నాగయ్య, బత్తిని తిరుమలేశ్, నాయకులు బొల్లేపల్లి వెంకటయ్య, మంచే గోవర్ధన్, మర్రి అనిల్, పురుగుల మల్లయ్య, మెరుగు యాదగిరి, బొడిగే వీరయ్య, బత్తిని హన్మంతు, మధుసూదన్‌రెడ్డి, శ్రీకాంత్‌చారి పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి - రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్
అడ్డగూడూరు: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. ఆదివారం ధర్మారంలో జడ్పీటీసీ అభ్యర్థి శ్రీరాముల జ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థి చిగుళ్ల ఉపేంద్రతో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కారుగుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పొన్నాల వెంకటేశ్వర్లు, సర్పంచ్ శీలం జ్యోతి, మాజీ సర్పంచ్ మందుల విజయ, పొన్నాల చంద్రకళ, బొమ్మగాని నాగయ్య, చెరుకు మధు, పనుమటి సైదులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...