సృజనాత్మకతను వెలికి తీయాలి


Mon,May 13, 2019 02:23 AM

రామన్నపేట : ప్రతి విద్యార్థిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని ఆచార్య డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అన్నారు. ఆదివారం వెల్లంకి జడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు. నైపుణాన్ని దాగి ఉంటుందని, దానిని విద్య వైపు మళ్లించుకుంటే ఉన్నత విద్యలో విజయం సాధిస్తారని తెలిపారు. ప్రతిభ అంటే మార్కులు కావని, విద్యా, వినయం, మాట, మర్యాద, పలకరింపు అంశాలతో కూడిన భావన అన్నారు. తల్లిదండ్రులు మొదటి గురువుగా, తర్వాత ఉపాధ్యాయులే గురువులుగా, సమాజం నడవడిక నేర్పుతాయని, పూల దారి ఎంచుకోవాలని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హైస్కూల్ హెడ్‌మాస్టర్ కె.వెంకటయ్య, ఉపాధ్యాయులు సేనా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...