ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే


Sat,May 11, 2019 11:47 PM

బీబీనగర్: ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జమీలాపేట్, గూడూరు, బ్రాహ్మణపల్లి, జియాపల్లి, నెమురగొముల, రాయరావుపేట్, మహదేవ్‌పురం తదితర గ్రామాల్లో జడ్పీటీసీ అభ్యర్థి గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులు ఎరుకల సుధాకర్‌గౌడ్, గుంటిపల్లి లక్షీనారాయణ, ఆకుల నర్సింగరావు, మంచాల మహేందర్, తొర్పునూరి స్వప్నారాజశేఖర్‌గౌడ్, ఎరుకల విజయలక్ష్మి పాండురంగంగౌడ్, కొలను లావణ్య దేవేందర్‌రెడ్డి, దీరావత్ బీమ్లాలకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో పాటు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమన్నారు. అందుకే రెండు సార్లు సీఎంగా కేసీఆర్‌కు ప్రజలు పట్టం కాట్టారన్నారు. ప్రజా సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా తెలంగాణ నిలుస్తుందన్నారు. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలన్నా.. రైతన్న సుభిక్షంగా ఉండాలన్నా.. తిరిగి ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే దిశగా సర్కార్ ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ప్రజలంతా ఈ నెల 14 జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు కారు గుర్తుకే వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మండలాన్ని అభివృద్ధి దిశగా పయనించేలా చేయాలన్నారు. జియాపల్లి నుంచి మహదేవ్‌పురం వరకు ఎమ్మెల్యే అందరికీ అభివాదం చేస్తూ బుల్లెట్‌పై వెళ్లారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొంతం లింగయ్యగౌడ్, సర్పంచ్‌లు బొర్ర రమేశ్, గడ్డం బాల్‌రెడ్డి, మొరుగాడి బాల్‌రాజు, మంగమ్మ , మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, నాయకులు మన్నె బాల్‌రాజు, మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, మెట్టు మోహన్‌రెడ్డి, సంకూరి నాగరాజు, గూడూరు మహిపాల్‌రెడ్డి, తూపెళ్లి కొండల్‌రెడ్డి, అమరేందర్, బింగి శ్రీనివాస్, బోయపల్లి నర్సింహరెడ్డి, వనం శ్రీశైలం, సుబ్బిరాంరెడ్డి పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...