దేశానికి పల్లెలే పట్టు కొమ్మలు


Sat,May 11, 2019 11:47 PM

అడ్డగూడూరు : దేశాభివృద్ధిలో పల్లెలే పట్టు కొమ్మలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని చిర్రగూడూరులో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ విధ్వంసం తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ అలోచనతో చిన్న జిల్లాలు, చిన్న మండలాలు ఏర్పాటుతో గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయని అన్నారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేసినట్లు గానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీఆరెస్ బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. నూతనంగా ఏర్పడిన మండలంలో మిగిలిపోయిన సాగు, తాగునీరు సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి శ్రీరాముల జ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థి పాశం రాణి, సింగిల్ విండో చైర్మన్ చిత్తలూరి హన్మంతురావు, సర్పంచ్ కమ్మంపాటి పరమేశ్, ఎంపీటీసీ చౌగోని మంజుల, నాయకులు కంచర్ల అశోక్‌రెడ్డి, చిత్తలూరి సూధాకర్, చౌగోని సత్యంగౌడ్ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...