అమ్మను మించి దైవమున్నదా..


Sat,May 11, 2019 11:47 PM

సంస్థాన్‌నారాయణపురం : అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అర్థమున్నదా.. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే .. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే .. జగమే పలికే శాశ్వత సత్యమిది అన్నాడో కవి. ఇది అక్షర సత్యం. అమ్మ లేనిదే సృష్టి లేదు.
ఏ తల్లి అయినా బిడ్డను తొమ్మిది నెలలు మోసి కన్న తర్వాత అతనికి కొంత వయసు వచ్చే వరకు ఎత్తుకొని మోస్తుంది. తర్వాత అతనే స్వయంగా ఎదుగడం నేర్చుకుంటాడు. ఎదిగిన కొడుకుకు అకస్మాత్తుగా కండరాల క్షీణతకు లోనుకావడంతో ఇక జీవితాంతం అతన్ని మోస్తూనే ఉన్నది ఈ తల్లి కత్తుల రాములమ్మ. తన కొడుకుకు యుక్త వయస్సు వచ్చినప్పటికీ అతన్ని రోజు ఎత్తుకుంటుంది. సమయానికి బువ్వ తినిపిస్తుంది. స్నానం చేపిస్తుంది. ఇలాంటి బాధ, ఇబ్బంది పగవాడికి కూడా రావద్దు అంటున్నది రాములమ్మ.
లింగవారిగూడెం గ్రామానికి చెందిన వెంకయ్య-రాములమ్మ కుమారుడు బాలకృష్ణ చిన్నప్పడు మంచిగానే అందరితోపాటు ఆడుతూ.. పాడుతూ.. బాల్యం గడిపాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. అప్పటి నుంచి తిరుగని దవఖాన లేదు. తినని మందులేదు. అయిన ఫలితం లేదు. కండరాల క్షీణత అని, నయం చేయడం కష్టం అని చెప్పారు వైద్యులు. అప్పటికే లక్షల రూపాయలు మందులకు ఖర్చు చేశారు. నడువలేడు, కూర్చోలేడు, ప్రతి పనికి తల్లి సాయం కావల్సిందే. తల్లి సాయం లేనిది ఏ పని స్వయంగా చేసుకోలేడు. తన కన్నా పెద్దవాళ్లు ఇద్దరు అన్నయ్యలు కూడా బాధపడుతున్నారు. వారు జీవితంలో కుదురుకున్నారు. కానీ బాలకృష్ణకు ఇలా జరుగడంతో ఇక ఆ తల్లి బాధ వర్ణనాతీతం.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...