విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు


Sat,May 11, 2019 11:46 PM

డుగు గ్రామ శివారులోని రాగాల రిసార్ట్స్ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్ గౌడ్, క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ పట్టణానికి చెందిన రాముడు చంద్రభూషన్(25) తన కుటుంబంతో కలసి హైదరాబాదులోని బేగంపేటలో ఉంటూ జూబ్లిహిల్స్‌లోని గ్లోబల్ లాబిక్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా అదే కంపెనీలో పనిచేసే హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన తన స్నేహితుడు క్రాంతి వివాహ నిచ్చితార్థం బుధవారం జరిగింది. క్రాంతి బ్యాచ్‌లర్ పార్టీ నిమిత్తం తన తోటి ఉద్యోగులైన చంద్రభూషన్, వంశీలతో పాటు మరో 11మంది స్నేహితులతో కలసి శుక్రవారం సాయత్రం వేర్వేరు కార్లలో కొండమడుగు పరిధిలోని మైక్రోఫిల్టర్ కంపెనీ ముందు ఓ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అనంతరం విందు, వినోదాలు చేసుకొని శనివారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో చంద్రభూషన్, వంశీ, భరత్‌లు కలిసి హుందాయ్ ఐటెన్ కారులో గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరారు. వారు మద్యం మత్తులో ఉండటంతో పాటు కొత్త ప్రాంతం కావడంతో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి వైపు వెళ్లాల్సిన వీరు కొండమడుగు వైపు వెళ్లారు. కాగా రాగాలా రిసార్ట్స్ సమీపంలో మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో చంద్రభూషన్ అక్కడిక్కడే మృతి చెందగా వంశీ, భరత్‌లకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సుధాకర్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారమైన వివరాలను సేకరించారు. కొత్త ప్రాతం కావడం, అందరూ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి అన్న సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...