ఊరూరా.. టీఆర్‌ఎస్ హోరు


Sat,May 11, 2019 11:46 PM

బొమ్మలరామారం: మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా, మండల ప్రాదేశిక సభ్యుల ప్రచారం జోరుగా సాగుతున్నది. శనివారం మండలంలోని ప్యారారంలో జడ్పీటీసీ అభ్యర్థి ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి చిమ్ముల సుధీర్‌రెడ్డిలు మాజీ మంత్రి ఉమామాధవరెడ్డితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. అనంతరం వారు గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్‌తోనే గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే పేదల ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యూత్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి వరుగంటి సతీశ్‌గౌడ్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్యారారం ఎంపీటీసీ అభ్యర్థి చిమ్ముల సుధీర్‌రెడ్డి గెలుపునకు సహకరిచాలని కోరుతూ టీఆర్‌ఎస్ యూత్ నాయకుడు బుక్యా పాండునాయక్ గద్దెరాళ్ల తండాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ నాయకులు చింతల యాదగిరి, ఉపసర్పంచ్ జూపల్లి భరత్, కట్ట శ్రీకాంత్‌గౌడ్, వంశీరెడ్డి, పట్టణ అధ్యక్షుడు బండి మహేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...