గులాబీ జెండా ఎగురేయాలి


Sat,May 11, 2019 11:46 PM

మోత్కూరు : మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగుర వేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శనివారం మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెం, పొడిచేడు, అనాజిపురం, దాచారం గ్రామాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. వాటిని ప్రజలకు వివరించి పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు విజయం సాధించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో టీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలుచుకోవడం ఖాయమన్నారు. నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో ఎంపీపీ, తొమ్మిది జడ్పీటీసీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకొని సత్తా చాటనుందన్నారు.

ఐదేండ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలనలో సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించామన్నారు. ఇంకా గ్రామాల్లో మిగిలిన అభివృద్ధి, ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశ పెడుతున్న పథకాలను అర్హులందరీకి చేరవేయాడానికి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు తామేదో ఎలగబెడుతామని మళ్లీ ప్రజలను మోసం చేసే కుట్రలకు పాల్పడుతుందన్నారు. వాటిని ప్రజలను తిప్పే కొట్టే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా దత్తప్పగూడెంలో మోత్కూరు మాజీ సమితి అధ్యక్షుడు కంచర్ల శంకర్‌రెడ్డి, అనాజిపురంలో మాజీ సర్పంచ్ గోరుపల్లి తిరుపతిరెడ్డిలను కలిశారు. వారి ఆరోగ్య విషయాలపై వాకబు చేశారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకురాలు కాసోజు శంకరమ్మ, కంచర్ల అశోక్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కొణతం యాకుబ్‌రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి గోరుపల్లి శారద, ఎంపీటీసీ అభ్యర్థులు మల్లం అనిత, శివరాత్రి మహేశ్, సర్పంచులు పేలపుడి మధు, ఉప్పల లక్ష్మి, ఎలుగు శోభ, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలుగు సోమయ్య, బొడిగే వీరయ్య, నాయకులు సాజిత్, పేలపుడి సత్యనారాయణచౌదరి, వెంకన్న, యాదయ్య, సత్తయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...