రైతు శ్రేయస్సే ధ్యేయం


Thu,April 25, 2019 11:52 PM

- ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
- కేంద్రప్రభుత్వ అండర్ సెక్రటరీ అభయ్‌కుమార్
- చౌటుప్పల్ మార్కెట్‌యార్డు సందర్శన
- రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : రైతు శ్రేయస్సే ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ అభయ్‌కుమార్ అన్నారు. గురువారం చౌటుప్పల్ మార్కెట్‌యార్డును సందర్శించారు. ధాన్యం సేకరణను పరిశీలించారు. తేమ తీసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు.

ధాన్యం విక్రయానికి మార్కెట్ యార్డులకు వస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వ అండర్ సెక్రటరీ అభయ్‌కుమార్ అన్నారు. గురువారం చౌటుప్పల్‌లోని మార్కెట్ యార్డులోని ధాన్యం రాసులను ఆయన పరిశీలించారు. ధాన్యం తేమను తీసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. తానే స్వయంగా ధాన్యం తేమను తీశారు. ఈ సందర్భంగా అక్కడ రికార్డులో రాసిన రీడింగ్‌లకు, తాను పరిశీలించిన రీడింగ్‌లకు వత్యాసం ఎందుకు వచ్చిందని మార్కెటింగ్ అధికారులను అడిగారు. నిల్వ ఉంచిన ధాన్యం తేమ కొద్దిగా అటు.. ఇటు అవుతుందని, 17 శాతం మాయిశ్చర్ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని అధికారులు వివరించారు. యార్డులో నూతనంగా నిర్మించిన గోదాంను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఏవైన సమస్యలు ఉన్నాయా..? ధాన్యం విక్రయించాక ఎన్ని రోజులకు డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు తమకు ఎలాంటి సమస్యలు లేవని, కొనుగోలు చేసిన 48 గంటల్లోపు డబ్బులు పడుతున్నాయని చెప్పడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. హమాలీలకు ఎంత కూలీ చెల్లిస్తున్నారని రైతులను అడడగా.. క్వింటాల్‌కు రూ.27 చెల్లిస్తున్నామని వారు తెలిపారు. రైతుల శ్రేయస్సుకు పెద్దపీట వేయాలని సూచించారు. ధాన్యం కొనుగులు బాగా జరుగుతుందని కితాబిచ్చారు.

అనంతరం మార్కెట్ కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన వెంట ఫుడ్ కార్పొరేషన్ అధికారులు వికాస్ బండర్, నిశార్, ఆర్డీవో ఎస్.సూరజ్‌కుమార్, డీఎస్‌వో పి.సంధ్యారాణి, డీఎంవో సారిక, డీసీవో నాగేశ్వర్‌రావు, డీఏవో అనురాధ, సివిల్ సైప్లె డీఎం గోపాల కృష్ణ, తహసీల్దార్ రవీంద్రసాగర్, మార్కెట్ కార్యదర్శి ఎండీ ఫసియొద్దీన్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...