తొలి దశ పరిశీలనలు పూర్తి


Thu,April 25, 2019 11:51 PM

- 67 ఎంపీటీసీ స్థానాలకు 523 నామినేషన్లు ఓకే
- 5 జడ్పీటీసీ స్థానాలకు 61 నామినేషన్లు ఓకే
- రెండో విడుతకు నేటి నుంచి నామినేషన్లు
- రెండో విడుత 26 నుంచి 28 వరకు
- రెండో దశ ఎంపీటీసీ స్థానాలు 53
- ఆలేరు, గుండాల, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, మోటకొండూరుల్లో నేటి నుంచి ఎన్నికల సందడి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : తొలి విడుత నామినేషన్ల పర్వంలో పరిశీలన గురువారం పూర్తయ్యాయి. మొత్తం 67 ఎంపీటీసీ స్థానాలకు 523 మంది నామినేషన్లు సరిగానే ఉన్నట్లు అధికారులు తేల్చారు. అదేవిధంగా 5 జడ్పీటీసీ స్థానాలకు గాను 61 నామినేషన్లు సరిగానే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కాగా రెండో విడుత ఆలేరు, గుండాల, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, మోటకొండూరులలో నామినేషన్ల జోరు కొనసాగనుంది.

మొదటి విడుత నామినేషన్లలో భూదాన్‌పోచంపల్లిలో 10 ఎంపీటీసీ స్థానాలకుగాను 54 మంది 62 నామినేషన్లను దాఖలు చేశారు. జడ్పీటీసీ పదవి కోసం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. చౌటుప్పల్ మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 88 మంది 107 నామినేషన్లు దాఖలు చేశారు. జడ్పీటీసీ పదవి కోసం 17 మంది నామినేషన్లు వేశారు. రామన్నపేట మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకుగాను 104 మంది 122 నామినేషన్లు దాఖలు చేశారు. జడ్పీటీసీ పదవి కోసం 11 మంది నామినేషన్లు వేశారు. వలిగొండ మండలంలో 100 మంది 126 నామినేషన్లు దాఖలు చేశారు. జడ్పీటీసీ కోసం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకుగాను 92 మంది 106 నామినేషన్లు దాఖలు చేశారు. జడ్పీటీసీ కోసం 13 మంది నామినేషన్లు వేశారు మొత్తం 67 ఎంపీటీసీ స్థానాలకు 523 మంది నామినేషన్లు సరిగానే ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఐదు జడ్పీటీసీల కోసం 49 మంది 61 నామినేషన్లు వేయగా.. అన్ని సరిగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి ఉపసంహరణల పర్వం ప్రారంభంకానుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ జడ్పీటీసీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని సమీకరణాలు పాటించి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మొదటి విడుత జరుగనున్న ఎన్నికలకు 26న స్క్రూటీలో పోయిన వాటికి అప్పీల్ అవకాశం, 27న అభ్యంతరాలు, 28న విత్‌డ్రాలు, అదేరోజు అభ్యర్థుల చివరి లిస్టు వెల్లడిస్తారు. మే 6న ఎన్నికల నిర్వహిస్తారు.

రెండో విడుతకు నేటి నుంచి నామినేషన్లు..
ఆలేరు, గుండాల, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్క్రూటీ రెండో విడుత 29న, ఫిర్యాదులు మొదటి విడుత 27న, రెండో విడుత మే 1 వరకు ఫిర్యాదులు ఇవ్వవచ్చునని షెడ్యూల్ ప్రకటనలో పేర్కొన్నారు. రెండో విడుత మే 10న పోలింగ్ నిర్వహిస్తారు. మే 27న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. కౌంటింగ్ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఎంపీటీసీలకు రూ.1.50 లక్షలు, జడ్పీటీసీలకు రూ.4 లక్షల వరకు వ్యయ పరిమితిగా నిర్ణయించారు. జిల్లాలోని భువనగిరి డివిజన్ పరిధిలోని రెండు విడుతలుగా, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని స్థానాలనకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...