ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి


Thu,April 25, 2019 11:49 PM

చౌటుప్పల్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సీపీ మహేశ్‌భగవత్ పోలీసు అధికారులను ఆదేశించారు. లక్కారం సాన్‌జాన్ పాఠశాలను ఆయన గురువారం సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాండ్ రూమ్, కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటిష్ట నిఘా మధ్యన ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సందర్శించిన వారిలో సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్‌సింగ్, జేసీ రమేశ్, ఆర్డీవో ఎస్.సూరజ్‌కుమార్, సూపరింటెండెంట్ శేషాద్రి, ఎస్సై నవీన్‌కుమార్ ఉన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...