రాహుల్ ప్రధాని కావడం ఖాయం


Thu,April 25, 2019 11:49 PM

కట్టంగూర్ : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని వైవీఆర్ ఫంక్షన్‌హాల్‌లో గురువారం కాంగ్రెస్ పార్టీ మండలస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. జడ్పీటీసీతో పాటు అన్ని ఎంపీటీసీ స్థానాలను గెలుచుకొని ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికులా పని చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు పోగుల నర్సింహ అధ్యతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్‌యాదవ్, సుంకరబోయిన నర్సింహ, రెడ్డిపల్లిసాగర్, పెద్ది సుక్కయ్య, ముషం రవికుమార్, ఎంపీటీసీ చింత వెంకటనర్సయ్య, సర్పంచులు పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, సైదులు, సైదిరెడ్డి, పరుశరాములు, ముక్కాముల శేఖర్, గద్దపాటి రాములు, రెడ్డిపల్లి స్వామి, ఉప సర్పంచ్ అంతటి శ్రీను, మహేశ్వరం నగేష్, బొజ్జ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...