ఆంగ్లభాషపై పట్టు సాధించాలి


Wed,April 24, 2019 11:10 PM

- గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
ఆలేరుటౌన్ : నేటి పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే ఆంగ్లభాషపై పట్టు సాధించాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మైండ్ ట్రీ సహకారం, వస్పరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంగ్లిష్ భాష ప్రాధాన్యం గుర్తించిన ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లోనూ ఇంగ్ల్లిష్ మీడియం భోధనను ప్రవేశపెట్టిందన్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లిష్‌ను నేర్చుకోవాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఎలాంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వస్పరి ఫౌండేషన్ నిర్వహకుడు వస్పరి శంకర్‌ను అభినందించారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆకవరం మోహన్‌రావు, పట్టణ అధ్యక్షుడు మెరిగాడి వెంకటేశ్, ఎంపీపీ క్యాసగళ్ల అనసూయ, ఎంపీటీసీ చింతకింది మురళి, బింగి రవి, మండల అధికార ప్రతినిధులు జింకల రామకృష్ణ, పంతం కృష్ణ, నాయకులు పొరెడ్డి శ్రీనివాస్, కందుల రామన్‌మాదిగ, కందుల శంకర్, రచ్చ రాంనర్సయ్య, గ్యాదపాక నాగరాజు, తాళ్లపల్లి మహేశ్, పూల శ్రావణ్, కుండె సంపత్, గ్యార నరేశ్, మోరిగాడి ఇందిర, సీస మహేశ్వరి, దూడం మధు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...