నామినేషన్ ప్రక్రియ పరిశీలన


Wed,April 24, 2019 11:10 PM

భూదాన్‌పోచంపల్లి : జిల్లాలో నిర్వహిస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు గోవింద్‌సింగ్ పరిశీలించారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఏ పార్టీ నుంచి ఎంత మంది నామినేషన్ వేశారు. ఎంపీటీసీల వారిగా ఎన్ని జడ్పీటీసీ స్థానానికి ఎన్ని నామినేషన్ దాఖలయ్యాయి అనే వివరాలను తెలుసుకున్నారు. ఇక హెల్ప్‌డెస్క్ ద్వారా నామినేషన్ పత్రాలను పూరించడంలో ఎలాంటి సాయం అందిస్తున్నారనే విషయాన్ని పరిశీలించారు.

జిల్లాలో ఎన్ని మండలాల్లో మెదటి విడుత ఎన్నికలు జరుగుతున్నాయి అనే వివరాలను ఆర్డీవో సూరజ్ కుమార్ ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆయన కోరారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్ కుమార్, ఏసీపీ సత్తయ్య, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ గుగులోతు దశరథనాయక్, ఎస్సై రాజు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...