అభ్యర్థులు విధివిధానాలు పాటించాలి


Wed,April 24, 2019 11:10 PM

మోటకొండూర్ : జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియలో విధివిధానాలు తూచా తప్పకుండా పాటించాలని ఆలేరు ఎంపీడీవో హనుమంత్‌ప్రసాద్ తెలిపారు. బుధవారం మోటకొండూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వివిధ పార్టీల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మోటకొండూర్ మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఈనెల 26 నుంచి 28 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆలేరు పాత ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కులధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. నామినేషన్ పత్రాలను నింపడంతోపాటు ఆస్తి, ఇతర పన్నుల బకాయిలు చెల్లించాలని సూచించారు. స్వీయ అఫిడవిట్ ఆస్తులు, నేరచరిత్రకు సంబంధించి స్వీయ సంతకంతో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రతిపాదకులు ఒక్కరు చొప్పున ఉండాలని చెప్పారు. బీ ఫారం సమర్పించేందుకు పార్టీలు ఇచ్చే బీఫారంను నామినేషన్ల ఉపసంహరణ గడువు చివరిరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు సమర్పించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రవణ్‌కుమార్, వివిధ పార్టీ నాయకులు రవీందర్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, నర్సిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి జి శశికాంత్‌గౌడ్ మరియ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...