యాదాద్రిలో భక్తుల సందడి


Wed,April 24, 2019 11:10 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్య పూజల కోలాహలం నెలకొన్నది. బుధవారం వేకువజామునకే స్వయంభువులు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. బాలాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి రోజు ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ. 100 టికెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పాటు పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతున్నది. కొండపైన గల రామలింగేశ్వరాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామివారి వ్రతాల్ల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ.73, 000 ల ఆదాయం సమకూరింది.

శ్రీవారి ఖజానాకు రూ. 7, 22, 135 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.7, 22, 135 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 85,064, 100 రూపాయల టికెట్‌తో రూ. 60,000 కల్యాణకట్ట ద్వారా రూ. 25,600 గదులు విచారణ శాఖతో రూ. 57,250 ప్రసాదవిక్రయాలతో రూ. 3,17,010 శాశ్వత పూజల ద్వారా రూ. 20,232 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఆదాయశాఖ అధికారులు తెలిపారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...