ఘనంగా ఆంజనేయుడికి పూజలు


Wed,April 24, 2019 12:09 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి వారికి మంగళవారం ఆకు పూజ ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి వారిని శ్రీచందనంతో అలంకరించారు. జిల్లేడు పూలు, తమలపాకులతో అర్చన చేశారు. ఆంజనేయ స్వామివారికి ఇష్టమైన తినుబండాగారాలను నైవేద్యంగా సమర్పించారు. వడ పప్పు, బూరెలు, అరటి పండ్లు సమర్పించి హనుమాన్ చాలీసా పఠించారు. కార్యక్రమాలను ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్లరంగాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహునికి మంగళవారం వివిధ పూజలు దర్శనాలు అన్నదానం, ప్రసాద విక్రయాలు. సామూహిక సత్యనారాయణస్వామి వ్రత పూజలతో శ్రీవారికి రూ. 57,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. సాంప్రదాయ నిత్య పూజలు పెద్ద ఎత్తున జరిగాయి.
శ్రీవారి ఖజానాకు రూ. 7,43,121 ఆదాయం
శ్రీవారికి ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1, 28, 256, 100 రూపాయల దర్శనం టికెట్‌తో రూ.41,700 వ్రత పూజలతో రూ.57,000 ప్రసాద విక్రయాలతో రూ. 3, 60, 350 విచారణ శాఖతో రూ. 64,010 శాశ్వత పూజలతో రూ. 12,000 తోపాటు అన్ని విభాగాల నుంచి రూ. 7, 43, 121 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆదాయ శాఖ అధికారులు తెలిపారు.

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
మోత్కూరు: ప్రజలందరూ పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మోత్కూరు పురపాలక సంఘం పరిధిలోని పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తితో పాటు 100 మందికి ఆయన పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ నాయకత్వంలో పార్టీ గ్రామాల్లో మరింత పునర్నిర్మాణం కానుందన్నారు. ఇప్పుడు జరుగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో, త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కొణతం యాకూబ్‌రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్లు టి. మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేందర్‌నాథ్, రైతు సమన్వయ మండల కో ఆర్డినేటర్ కొండ సోంమల్లు, ఎంపీటీసీ జంగ శ్రీను, మాజీ సర్పంచ్ నిమ్మల వెంకటేశ్వరు పాల్గొన్నారు.

సంస్థాన్‌నారాయణపురం : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చిమిర్యాల గ్రామసర్పంచ్ దోనూరి విజయేందర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాతే అన్ని గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి జరుగుతున్నదన్నారు. బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
బీబీనగర్ : టీఆర్‌ఎస్ తరపున పోటీచేసే జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మండల అభివృద్ధ్దికి బాటలు వేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మగ్దుంపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంగళవారం బీబీనగర్‌లో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో పాటు నియోజక వర్గంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చేస్తున్న సేవలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోళి పింగళ్‌రెడ్డి, ఎరుకల సుధాకర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్ నాయకులు మల్లగారి శ్రీనివాస్, శ్రీరాములు, వెంకటేశం, నర్సింహ, కృష్ణ పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...