నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు


Wed,April 24, 2019 12:05 AM

భువనగిరి అర్బన్ : నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. జిల్లాలో ఓపెన్ ఇంటర్ పరీక్షల నిర్వహిణకు రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 383 మంది ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు పట్టణంలో గౌతమ్ మోడల్ స్కూల్‌లో 224 మంది, మాంటిస్సోరి పాఠశాలలో 159 మంది పరీక్ష రాయనున్నారు.
ఓపెన్ టెన్త్ పరీక్షలు..
ఓపెన్ టెన్త్ పరీక్షలకు జిల్లా కేంద్రంలో మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు 715 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో మదర్ థెరిస్సా పాఠశాలలో 285 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్‌లో 226 మంది, గల్స్ హైస్కూల్‌లో 204 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగనున్నాయి. ప్రతి సెంటర్‌కు ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్, ప్రతి సెంటర్‌కు మెడికల్ సిబ్బంది, ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షల సెంటర్లలో జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల సెంటర్ అధికారి సీహెచ్.రంగరాజన్ పర్యవేక్షించనున్నట్టు తెలిపారు.
పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : జిల్లా విద్యాశాఖాధికారిణి రోహిణి
నేటి నుంచి ప్రారంభంకానున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూరైనాయి. గ్రామాల నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించవద్దని సంబంధిత అధికారులకు సూచించాం. పరీక్షల సమయంలో పట్టణంలోని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని ఆదేశించడం జరిగింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
మోటకొండూర్(యాదగిరిగుట్టటౌన్) : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటే విధంగా ప్రచారం ముమ్మరం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీజేపీ మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం శైలీపై పార్టీ శ్రేణులకు వివరించారు. ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లను అడగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లేశం, ఉపాధ్యక్షుడు రాఘవులు, నరేందర్, అసెంబ్లీ కన్వీనర్ కానుగంటి శ్రీనివాస్‌రెడ్డి, పార్లమెంట్ సహాయ కార్యదర్శి మురళీధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాయగిరి రాజు, నాయకులు భరత్ రంగ సత్యం, పంతంగి శేఖర్, కళ్లెం శ్రీనివాస్, చిత్తర్ల క్రిష్ణ, చైతన్య, జంపాల శ్రీను, పాండు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...