గుండాలలో గులాబీ జెండా ఎగురాలి


Wed,April 24, 2019 12:05 AM

గుండాల : రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గుండాల మండలంలో గులాబీ జెండా ఎగుర వేయాలని జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ కొలుపుల అమరేందర్ అన్నారు. మంగళవారం గుండాల మండల కేంద్రంలోని రాజ్‌కమల్ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చి ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గుండాల మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాలతోపాటు జడ్పీటీసీ స్థానాన్ని గెలిపించుకోవాలని సూచించారు. మండల ఎన్నికల అబ్జర్వర్‌గా తనకు బాధ్యతలు అప్పజెప్పడంతో అన్ని గ్రామాల్లో కార్యకర్తల పనితీరును పరిశీలించడం జరుగుతుందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతిఒక్కరూ పని చేయాలన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.
టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించడం కోసం కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగి వేణుగోపాల్, జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గార్లపాటి సోమిరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ గడ్డమీది పాండరి, ఎంపీటీసీ బడక మల్లయ్య, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఇమ్మడి దశరథ, సర్పంచ్ ఏలూరి రాంరెడ్డి, నాయకులు చిందం ప్రకాశ్, మద్దుల బాల్‌రెడ్డి, సుధాకర్, ఉపేంద్ర, శ్రీశైలం, సత్తిరెడ్డి, సురేందర్‌రెడ్డి, మోషా, నరేశ్, భిక్షపతి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...