ఘనంగా భీమలింగేశ్వర ఆలయ వార్షికోత్సవాలు


Wed,April 24, 2019 12:05 AM

మోటకొండూర్ : శ్రీ గణేశ, వీరభద్ర, ఆంజనేయ నవగ్రహ పార్వతి నాగదేవత సహిత భీమలింగేశ్వర ఆలయ వార్షిక మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం మోటకొండూర్ మండలం చాడ గ్రామంలోని భీమలింగేశ్వరాలయంలో ఉదయం 8 గంటల నుంచి మంగవాయిధ్యాల నడుమ స్వస్తి వాచనం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్వ పాశనం వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అంకురారోహణం, యాగశాలప్రవేశం, అఖండ దీపారాధన, యాగశాల సంస్కారం, నవగ్రహ మాతృక, యోగిని వాస్తు క్షేత్రపాలక, బ్రహ్మది మండల దేవతా స్థాపన, కుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ఠ, స్థాపితా దేవతామంత్రవనం, పంచసూక్త హవానం, శాంతి పౌష్ఠిక మంత్ర హవానం, జయాధి హోమం, బలి ప్రదానం, పూర్ణాహుతి, మహా అభిషేకం, అలంకరణ, హారతి, మంత్రపుష్పం, మహా ప్రసాదం వినియోగం వంటి పలు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం అత్యంత వైభోపేతంగా వేదపండితల నడుమ శివపార్వతుల కల్యాణం ఘనంగా జరిగింది. తదనంతరం ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్గ ఎట్టమ్మ, చాడ మధుసూదన్‌రెడ్డి, జక్క యాదిరెడ్డి, కొత్తజు సిద్దయ్యచారి, మన్నెం నర్సిరెడ్డి, మల్గ బాలయ్య, దొంతి శ్రీనివాస్, కూరెళ్ల మురళి, పబ్బతి శ్రీదర్‌రెడ్డి, మల్గ సిద్ధులు, ముత్యాల కృష్ణ, శివమాలధారణ భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...