అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి


Wed,April 24, 2019 12:05 AM

భువనగిరిరూరల్ : రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు, హన్మాపురం సర్పంచ్ ఎడ్ల రాజిరెడ్డి, మన్నెవారిపంపు సర్పంచ్ బోయిన పాండు అన్నారు. మండలంలోని హన్మాపురం సమీపంలోని సాయిపుష్పమ్మ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన హన్మాపురం, మన్నెవారిపంపు గ్రామాల టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి పాల్పడి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ సందర్భంగా హన్మాపురం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు సింగిరెడ్డి నర్సిరెడ్డిని ఎంపీటీసీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో హన్మాపురం, మన్నెవారిపంపు గ్రామాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు రాగల్ల శ్రీనివాస్, పైళ్ల దేవేందర్‌రెడ్డి, మాజీసర్పంచ్ హన్మగంటి వెంకటేశం, టీఆర్‌ఎస్ నాయకులు ఎడ్ల చిన్నబాల్‌రెడ్డి, ఎనుగు శివలింగారెడ్డి, సత్యనారాయణ, స్వామి, గాదె రమేశ్, మల్లారెడ్డి, కిష్టయ్య, లింగారెడ్డి, భరత్‌రెడ్డి, బోయిని గండయ్య, తుల్జ రాములు, మోడబోయిన పెంటయ్య, అంజయ్య, పిట్టల శ్రీను, ఆముదాల రమేశ్, రంగ స్వామి, భాస్కర్, బాలరాజు, మహేశ్‌రెడ్డి, మల్లేశ్, పరమేశ్ పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...