ఓట్ల లెక్కింపు కోసం భవనాల పరిశీలన


Wed,April 24, 2019 12:05 AM

ఆలేరుటౌన్ : ఆలేరు పట్టణంలోని జేఎంజే స్కూల్ భవనాన్ని కలెక్టర్ అనితారామచంద్రన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలో జరుగనున్న ప్రాదేశిక ఎన్నికల అనంతరం ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, గుండాల, మూటకొండూరు మండలంలోని బ్యాలెట్ బాక్స్‌లను భద్రపర్చుట, అనంతరం ఓట్ల లెక్కింపు కోసం పట్టణంలోని జేఎంజే స్కూలు భవనాన్ని వారు పరిశీలిచారు. స్కూల్ భవనంలోని గదులను, మైదానాన్ని ఇతర సౌకర్యాలను గురించి స్కూల్ యాజమాన్న్నా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, మండల పరిషత్ ఈవోపీఆర్డీ వీరస్వామి లెక్కింపు కేంద్రంగా జేఎంజే స్కూల్ అన్ని విధాలుగా, అందరికి సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా జేసీ రమేశ్, డీసీపీ నారాయణరెడ్డి, ఎసీపీ మనోహార్‌రెడ్డి, యాదగిరిగుట్ట సీఐ ఆంజనేయులు, మండల రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ ఉన్నారు.
ఓట్ల లెక్కింపునకు పటిష్ట చర్యలు..
భువనగిరిరూరల్ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడుత ఎన్నికలు జరుగనున్న మండలాలు, ఓట్ల లెక్కింపు విషయంలో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. మంగళవారం రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌తో కలిసి మండలంలోని అనాజీపురం గ్రామ సమీపంలోని దివ్యబాల పాఠశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో స్టాంగ్‌ర్రూముల ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. సెక్యూరిటీ ఏర్పాట్లపై చర్చించారు. వీరి వెంట జేసీ రమేశ్, డీసీపీ నారాయణరెడ్డి, నాగిరెడ్డి, లైజన్ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఉన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...