రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం


Tue,April 23, 2019 12:47 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : రామలింగేశ్వరుడికి సోమవారం జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్త జనులు పరవశంతో రుద్రాభిషేకం జరిపించారు. యాదగిరికొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశాన్ని భక్తులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. భక్తులు శివుడ్ని కొలుస్తూ గంటన్నర పాటు రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రమణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు.విశేష పుష్పాలంకరణ జరిపారు. శివాలయం భక్తులతో నిండి పోయింది. పలు పూజలు కైంకర్యాలతో రూ. 45,032 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన పురోహితులు నర్సింహశర్మ ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిగాయి. కార్యక్రమంలో ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.

శ్రీవారి ఖజానాకు రూ.16,30,993 ఆదాయం
శ్రీవారికి ప్రధాన బుకింగ్ ద్వారా రూ.99,942 ప్రసాద విక్రయాలతో రూ. 5, 69, 185 విచారణ శాఖతో రూ. 60,850 తో పాటు ఇతరవిభాగాల నుంచి రూ.5, 23, 654 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆదాయశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ఉద్యోగులు, అర్చక బృందం, భక్తులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...