గ్రామాల్లో ప్రతిఒక్కరికీ పని కల్పించాలి


Tue,April 23, 2019 12:47 AM

నీలగిరి: ప్రతి గ్రామంలో ఉపాధి పనులు చేపట్టి జాబ్‌కార్డున్న ప్రతిఒక్కరికీ పని కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఉపాధిహామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ముందుగా చేసుకున్న ప్రణాళిక ప్రకారంగా అన్ని గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పని చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొంత అలసత్వం వహిస్తున్నారని, పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని నర్సరీల్లో పూర్తిస్థాయిలో విత్తనాలు నాటాలని ప్రతినర్సరీలో షేడ్ నెట్ ఉండాలని, ప్రస్తుతం ఈదురుగాలుల వల్ల అక్కడక్కడ అవి దెబ్బతిన్నట్లు సమాచారం ఉందని పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని తెలిపారు. వాటితోపాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి వాటిని పూర్తి చేసి ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలని సూచించారు. పెండింగ్ పేమెంట్స్ ఏవైనా ఉంటే ప్రతి కూలికి అందేవిధంగా చేయాలని తెలిపారు. సమావేశంలో ఏపీడీలు, అదనపు డీపీఓలు, సాంకేతిక సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...