బెంగ లేని వంగ సాగు


Tue,April 23, 2019 12:47 AM

కాయతొలుచు పురుగు నివారణకు..
కాయ వంకర్లు తిరగడం, కాయలకు రంధ్రాలు పడడంతో మార్కెట్లో సరైన ధర పలుకక రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుగు నివారణకు ప్రొఫినోఫాస్ 2మి.లీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నారు దశలో పురుగు ఆశిస్తే కొమ్మల చివరలు తుంచి వేయాలి.

తెల్లదోమ, పేనుబంక నివారణకు..
ఆకుల అడుగుభాగంలో చేరి రసం పీల్చడంతె ఆకులు ముడుచుకుపోతాయి. దీనిని నివారించేందుకు పిప్రోనిల్ 2మి.లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే వీటి నివారణకు ఎసిఫేట్ 1.5గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

నులి పురుగు నివారణకు..
నులిపురుగు ఆశించిన తోటల్లో వేర్లు బొడిపెలతో ఉంటాయి. మొక్క పీలగా మారుతుంది. దీని నివారణకు రైతులు అంతరపంటగా బంతిపూలను సాగు చేయాలి. పంట మార్పిడి ద్వారా నులిపురుగును నివారించవచ్చు.

ఆకుమాడు, కాయకుళ్లు తెగులు
గోధుమ రంగు మచ్చలు ఆకులపై ఏర్పడి పసుపువర్ణంగా మారి క్రమంగా ఆకు పూర్తిగా ఎండిపోయి రాలిపోతుంది. ఈ తెగులు చల్లని వాతావరణం ఉన్నప్పుడు పంటను ఎక్కువగా ఆశిస్తుంది. కాయలు కూడా పసుపురంగుకు మారి కుళ్లిపోతాయి. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3గ్రాముల చొప్పున కలిపి 10రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి.

సస్యరక్షణ చర్యలు..
- పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయాలి.
- లింగాకర్షక బుట్టలను ఎకరాకు నాలుగు చొప్పున ఏర్పాటు చేయాలి.
- రైతులు తోటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. తోటలో ఏమైనా తెగుళ్లు, చీడపీడలు కనిపిస్తే వెంటనే వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి.

నారు పోసిన నాటి నుంచే చర్యలు తీసుకోవాలి
వంగతోటను సాగు చేసే రైతులు నారు పోసిన నాటి నుంచే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తోటను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూ ఉండాలి. తోటకు పురుగులు, తెగుళ్లు ఆశించి నష్టపరుస్తూ ఉంటే వెంటనే సంబంధిత వ్యవసాయాధికారులను సంప్రదించి నివారణ మార్గాలు చేపట్టాలి. దీంతో వంగతోట రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు.
- బి.అంజనీదేవి, వలిగొండ మండల వ్యవసాయాధికారిణి

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...