ఘనంగా పెద్దమ్మతల్లి బోనాలు


Mon,April 22, 2019 12:17 AM

బొమ్మలరామారం : మండల కేంద్రంలోని శ్రీరామలింగేశ్వరస్వామి గుడి బావి చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించిన పెద్దమ్మతల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి తెల్లవారినుంచే ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం అగ్నిగుండాలను నిర్వహించిన అనంతరం అమ్మవారి ఘనంగా కల్యాణం జరిపించారు. సాయంత్రం అమ్మవారికి బోనాలతో ఊరేగింపు చేపట్టి నైవేద్యాలను సమర్పించారు. శివసత్తుల పూనకాలతో, ఒగ్గు కళాకారుల బృందం, డప్పు చప్పులతో బోనాల ప్రదక్షిణాలు చేసి, అమ్మవారికి వడిబియ్యం పోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

కార్యక్రమంలో ఒగ్గు కళాకారుల బృందం సభ్యులు కూకుట్ల రామస్వామి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బాల్‌నర్సింహ, జడ్పీటీసీ మర్రి జయమ్మాకృష్ణారెడ్డి, వైస్‌ఎంపీపీ శ్రీశైలం, సర్పంచ్ మహేశ్‌గౌడ్, ఎంపీటీసీ లావణ్యరామకృష్ణముదిరాజ్, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రవిశంకర్, గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు వెంకటయ్య, గణేశ్, కుశంగల సత్యనారాయణ, బాల్‌నర్సింహ, పండుగ నర్సింహ, మండల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గూదె బీరుమల్లయ్య, కార్యదర్శి ఎల్లబోయిన శ్రీహరి, ఉపసర్పంచ్ జూపల్లి భరత్, వార్డు సభ్యులు శాదం వరమ్మవీరేశం, గీతాకృష్ణ, భాస్కర్, బాల్‌రాజ్, నాయకులు గోపాల్, మల్లేశ్, భాస్కర్, ఉపేందర్, రాజు, భక్తులు, దాతలు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...