వడగండ్ల వానకు భారీగా వరి పంట నష్టం


Mon,April 22, 2019 12:04 AM

భువనగిరిరూరల్ : గత రెండు రోజుల కిందట కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానతో జిల్లాలోని 4212.6 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భువనగిరిలో 1090 ఎకరాల్లో, భూదాన్‌పోచంపల్లి మండలంలో 198 ఎకరాలు, ఆలేరులో 143ఎకరాలు, యాదగిరిగుట్టలో 685ఎకరాలు, బొమ్మలరామారంలో 118ఎకరాలు, రాజాపేటలో 75 ఎకరాలు, తుర్కపల్లిలో 559 ఎకరాలు, మోటకోండూరులో 555 ఎకరాలు, సంస్థాన్‌నారాయణపూర్‌లో 149.6ఎకరాలు, చౌటుప్పల్‌లో 40 ఎకరాలు, అడ్డగూడూరు మండలంలో 600 ఎకరాల్లో మొత్తం 4212.6ఎకరాల్లో వరి పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. బీబీనగర్, వలిగొండ, ఆత్మకూర్, రామన్నపేట, మోత్కూరు మండలాల్లో ఎలాంటి పంట నష్టం వాటిల్లలేదన్నారు. అదేవిధంగా 161మంది రైతులకు సంబంధించిన 132,80హెక్టార్లలో రూ.23,38,200 పంట నష్టం జరిగినట్లు జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి సురేశ్ చెప్పారు.

చౌటుప్పల్ మండలంలోని 7గురు రైతులకు సంబంధించి రూ.2,52000, ఆకుకూరలు పండించే 15మంది రైతులకు 108000, టమాటాసాగు చేసిన 12మంది రైతులకు 32,400, సంస్థాన్‌నారాయణపూర్ మండలంలో 45మంది రైతులకు చెందిన మామిడి తోటలకు రూ.108000, ముగ్గురు టమాటా రైతులకు రూ.16,200, 5గురు మామిడి రైతులకు రూ.21,600, మోత్కూరు మండలంలో ఇద్దరు మామిడి తోటల రైతులకు రూ.43,200, భువనగిరికి చెందిన 17మంది మామిడి రైతులకు రూ.4,68000, బత్తాయి రైతుకు రూ.50,400, బొమ్మలరామారం మండలానికి చెందిన 13మంది మామిడి రైతులకు రూ.2,66,400, తుర్కపల్లి మండలానికి చెందిన 11మంది మామిడి రైతులకు రూ.3,24000, యాదగిరిగుట్టకు చెందిన 30మంది మామిడి రైతులకు రూ.6,48000 చొప్పున అకాల వర్షాలకు నష్టం వాటిలిందని తెలిపారు. రాజాపేట, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు మండలాల్లో ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...