ఆన్‌లైన్ విధానం ద్వారా కలప సేకరించాలి


Mon,April 22, 2019 12:04 AM

భువనగిరి అర్బన్ : అనుమతి పొందిన సామిల్ యాజమాన్యం ఆన్‌లైన్ ద్వారా కలపను సేకరించాలని జిల్లా అటవీశాఖ అధికారి వై.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సామిల్, టింబర్ అసోసియేషన్ జిల్లా సమావేశం ఆదివారం పట్టణ పరిధిలోని ఓ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ చెట్లు నరకాలంటే ఆన్‌లైన్ ద్వారా అనుమతి పొందాలన్నారు. జిల్లాలో వృక్షాల శాతం తక్కువగా ఉందని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కలపను అనుమతి లేకుండా ఇతర జిల్లాలకు తరలించేవారికి జరిమానా విధిస్తామని చెప్పారు. కలపను తరలించేవారిపై అధికారుల నిఘా ఉంటుందని, ఇందుకు సామిల్ యాజమాన్యం, అటవీ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సామిల్, టింబర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుందారపు కృష్ణాచారి, అటవీ అధికారులు శివలాల్, డీఆర్‌వో సోమయ్య, శ్రీనివాస్, సాగర్, సుహాసిని, వెంకటయ్య, శంకరాచారి, సుగ్రీవాచారి, ఉపేంద్ర, నారాయణ, సామిల్ యాజమానులు జలీల్, సలీమ్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...