ఘనంగా శ్రీ చెన్నకేశ్వరస్వామి రథోత్సవం


Mon,April 22, 2019 12:02 AM

భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌లో శ్రీ చెన్నకేశ్వర స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున దేవాలయంలో హోమం నిర్వహించారు. అనంతరం ధ్వజాతోరణం, ధ్వజకుంభ మండల అగ్ని, ఆరాధన, హవనం, మహా పూర్ణాహుతి, బలిహరణ, ఆరగింపు, మంగళ శాసనం, శాత్తుమరై, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని రథంపై గ్రామ పురవీధుల గుండా కోలాట భజన సంకీర్తణలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్తల మండలి చైర్మన్ నక్కల రాజిరెడ్డి, ధర్మకర్తలు కొండమడుగు కృష్ణస్వామి, జక్కలి శేఖర్, దొరగండ్ల బాలకృష్ణ, పుట్టపాక నందినికృష్ణ, ఎంపీటీసీ గుండ్ల హరిశంకర్‌గౌడ్, మాజీ సర్పంచ్ మునికుంట్ల బాలచంద్రంగౌడ్, దారెడ్డి మల్లారెడ్డి, కొంగరి కృష్ణ, కొండమడుగు కళమ్మ మల్లయ్య, మునికుంట్ల సోమలింగం, రుద్ర భిక్షపతి, దారెడ్డి దామోదర్‌రెడ్డి, రుద్ర వీరస్వామి, రుద్ర బాలరాజు, దొరగండ్ల మల్లేశ్, పుట్టపాక రమేశ్, రుద్ర వెంకటేశం, సిద్దగోని పాండు, శ్రీశైలం, రమేశ్, కొండమడుగు ప్రభాకర్, పాండు, కిష్టయ్య, సురేందర్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...