టీఆర్‌ఎస్‌తోనే ప్రజాసంక్షేమం..


Sat,April 20, 2019 11:19 PM

భువనగిరి అర్బన్ : టీఆర్‌ఎస్‌తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని సాయి కన్వెన్షన్‌హాల్‌లో శనివారం నిర్వహించిన భువనగిరి నియోజకవర్గ స్థానిక సంస్థ ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి కాలంలోనూ ప్రజలు కడుపునిండా నీళ్లు తాగుతున్నారంటే మిషనభగీరథ పథకం పుణ్యమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భువనగిరి ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. భువనగిరి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరువ తీసుకుంటున్నారన్నారు. అందరు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా వెళ్లాలన్నారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయినుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావించిన నాటి నుంచి భువనగిరి టీఆర్‌ఎస్ పార్టికి కంచుకోటగా ఉందన్నారు. ఇక్కడి అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురడం ఖాయమన్నారు.

పని చేసినవారికి గుర్తింపు లభిస్తుంది..
పార్టీ బలోపేతానికి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలన్నారు. సీటు దక్కని ఆశావహులకు నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట వేసేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందన్నారు.

సమన్వయంతో పనిచేయాలి..
నాయకులందరూ సమన్వయంతో పనిచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందింస్తుందన్నారు.

అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి..
టీఆర్‌ఎస్ పార్టి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసుకుని టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భువనగిరి పీఏసీఎస్ చెర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, నాయకులు లింగంయాదవ్, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు వెంకన్న, సుబ్బూరు బీరు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...