టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలి


Fri,April 19, 2019 11:19 PM

మునుగోడు : త్వరలో జరుగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో గల జమస్థాన్‌పల్లి క్రాస్‌రోడ్ వద్ద ఆర్‌కే ఫంక్షన్ హాల్లో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బొడ్డు నర్సింహాగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు మనుగడ లేదని, అందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా మరోసారి పట్టం కట్టారన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలతోపాటు జడ్పీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి, వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ జాజుల అంజయ్యగౌడ్, మండలాధ్యక్షుడు బొడ్డు నర్సింహాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బండా పురుషోత్తంరెడ్డి, ఐతగోని లాల్‌బహదూర్‌గౌడ్, సర్పంచ్‌లు గుర్రాల పరమేశ్, వెంకటయ్య, వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, బొజ్జ శ్రీను, ఎండీ రఫిక్, జక్కలి లోకేశ్, బొల్గూరి నర్సింహ, జంగిలి నాగరాజు, బంగారు రవి, సందీప్‌రెడ్డి, యాదయ్య, మాదగోని దేవలోకం, కృష్ణ, జలేందర్, ఐలయ్య పాల్గొన్నారు.

ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తాచాలి..
- ఎంపీ బూర నర్సయ్యగౌడ్
చండూరు, నమస్తే తెలంగాణ : రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు సత్తాచాటాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక సన్‌షైన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మండలంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల జాబితా ఏర్పాటు చేస్తుందని, ఆ జాబితా సీఎం కేసీఆర్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కార్మికభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బొమ్మరబోయిన వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు కోడి వెంకన్న, మార్కెట్ డైరెక్టర్ గండూరు స్వాతి జనార్ధన్, పందుల భిక్షం, కళ్లెం సురేందర్‌రెడ్డి, గోపిడి వెంకట్‌రెడ్డి, నల్లగంటి మల్లేశం, గుండమల్ల వెంకటేశం, తిరందాసు ఆంజనేయులు, జూలూరి శ్రీనివాస్, కలిమికొండ పారిజాత జనార్ధన్, తేలుకుంట్ల జానయ్య, పున్న ధర్మేందర్, భీమనపల్లి శేఖర్, సర్పంచ్‌లు నల్ల లింగయ్యయాదవ్, పల్లె వెంకటయ్య, నందికొండ నర్సింహారెడ్డి, కట్ట భిక్షం, నాతాల అంజిరెడ్డి, హైమద్, కటకం విజయ్ మోహన్, వడ్డెపల్లి గోపాల్, దోటి యాదయ్య, ఆంజనేయులు, కాటం శ్రీను, బోయపల్లి రమేశ్, కావలి ప్రసాద్, ఉరుగుండ్ల వెంకటేశ్వర్లు, కొంపల్లి వెంకటేశ్, శ్రీహరి, నరేశ్, రవి, వెంకన్న, శేఖర్, శ్రీను, దోటి యాదయ్య ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...