స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలి


Fri,April 19, 2019 11:18 PM

బొమ్మలరామారం : స్థానిక సంస్థల మండల పరిషత్ ఎన్నికల్లో మండలంలోని 11 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకొని గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గూదె బాల్‌నర్సింహ, ఎంపీపీ బొల్లంపల్లి తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకుడు మర్రి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పరిషత్ ఎన్నికల్లో సీట్లు ఆశించే అన్ని గ్రామాల పార్టీ కార్యకర్తల నుంచి బయోడేటా ఫారాలను స్వీకరించినట్లు చెప్పారు. దీంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల టీఆర్‌ఎస్ గ్రామశాఖల ఆధ్వర్యంలో రిజర్వేషన్ ప్రకారం కేటాయించిన బొమ్మలరామారం జనరల్ జడ్పీటీసీ స్థానానికి అభ్యర్థిగా టీఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధానకార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డికి ఇవ్వాలని తీర్మానించారు. లేనిచో స్థానిక పార్టీ కార్యకర్తలకే టికెట్ కేటాయించాలన్నారు. ఇతరులకు అవకాశం కల్పించి మంండల కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీయోద్దని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా పార్టీ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శులు వేముల సురేందర్‌రెడ్డి, ధీరావత్ రాజన్‌నాయక్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చిమ్ముల సుధీర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి వరిగంటి సతీశ్‌గౌడ్, నాయకులు పెద్దిరెడ్డి మల్లారెడ్డి, ఎస్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు దేవదాసునాయక్, నాయకులు కుశంగల సత్యనారాయణ, బానాల బాల్‌నర్సింహ, వాంకుడోత్ రాములునాయక్, రమేశ్‌గౌడ్, బండి మహేశ్‌గౌడ్, రాజ్‌కుమార్‌నాయక్, పాండునాయక్, రేసు రాంరెడ్డి, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు ధీరావత్ బాల్‌సింగ్, నరేందర్, తూడి నారాయణ, వివిధ గ్రామాల టీఆర్‌ఎస్ గ్రామశాఖ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

స్థానిక టికెట్ల కోసం ఆశాశహుల క్యూ..
తుర్కపల్లి : స్థానిక పోరులో టికెట్లు కేటాయించాలని కోరుతూ శుక్రవారం మండల టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఆశావహులు క్యూ కట్టారు. జడ్పీటీసీ స్థానంతో పాటు 10 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్ పార్టీ పక్షాన పోటీలో నిలిచేందుకు ఆశవహులు దరఖాస్తులు అందజేసేందుకు క్యూ కట్టడంతో మండల కేంద్రంలో సందడి నెలకొంది. తాము చేసిన సేవలు గతంలో పొందిన పదవులు తమకున్న అర్హతలు, ఆశిస్తున్న స్థానం తదితర వివరాలను దరఖాస్తులో పొందుపర్చి పార్టీ కార్యాలయంలో అందజేశారు. తమకు ఎలాగైన టికెట్లు ఇప్పించేలా చూడాలని పార్టీ పెద్దలను కలుస్తూ వారి మద్దతు కూడగట్టుకునేందుకు ఎవరికి వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహుల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ అన్నారు. ఆశావహుల దరఖాస్తులను పరిశీలించి ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల కోసం దరఖాస్తులు..
రాజాపేట : మండల ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయాడానికి జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల కోసం శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. రాజాపేట మండల జడ్పీటీసీ స్థానం బీసీ జనరల్ ఖరారు కావడంతో టికెట్ కోసం ఠాకూర్ ప్రమోద్‌సింగ్, జెల్ల భిక్షపతిగౌడ్, చామకూర గోపాల్‌గౌడ్, గౌటే లక్ష్మణ్, జూకంటి శ్రీనివాస్, గుంటి కృష్ణ, కాలె సుమలత, పల్లె నర్సింహులుగౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా 11 ంపీటీసీ స్థానాలల్లో కూడా టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువిరిశాయి. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల ప్రధానకార్యదర్శులు కోరుకొప్పుల వెంకటేశ్‌గౌడ్, భాస్కర్‌గౌడ్ ఉన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...