హనుమంతుడిలా నిగ్రహంగా ఉండాలి


Fri,April 19, 2019 11:18 PM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : హనుమంతుడిలా నిగ్రహంగా ఉంటే అనుకున్నది సాధించవచ్చని ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పాటిమీది భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథులుగా వారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమంతుడిలా అకుంఠిత దీక్షతో పనిచేస్తే విజయం సాధించవచ్చని తెలిపారు. హనుమాన్‌ను నిత్యం ధ్యానించడం వల్ల ఏకగ్రీత పెరుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో యువత ముందుడాలని, దీంతో భక్తిభావంతోపాటు స్నేహభావం కూడా పెరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సందగళ్ల నాగరాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి ఊడుగు రమేశ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు బొబ్బిళ్ల రాజేందర్, జక్కర్తి శేఖర్, బొడిగె బాలకృష్ణగౌడ్, దేప రాజు, నాయకులు ఊడుగు మల్లేశ్‌గౌడ్, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, మునుకుంట్ల సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...