ఆశావహుల క్యూ..


Thu,April 18, 2019 11:19 PM

- అధికార పార్టీలో స్థానిక టికెట్లకోసం పోటాపోటీ
- ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రాదేశిక బాధ్యతలు
- విపక్ష పార్టీల్లో గుబులు
- ఆర్థికంగా భారం.. ప్రజాస్పందన కరువు
- ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నిరాసక్తత

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు పల్లెల్లో తీవ్ర పోటీ నెలకొన్నది. అధికార పార్టీలో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారు. నువ్వా...నేనా....నీకా...నాకా అన్నట్లుగా టికెట్ల కోసం పోటీ మొదలైంది. జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నియోజకవర్గాల్లో బాధ్యులుగా ఎమ్మెల్యేలను నియమించడంతో టికెట్ ఆశిస్తున్నవారు వారిని కలుస్తున్నారు. మరోవైపు విపక్ష పార్టీల్లో స్థానిక సంస్థల ఎన్నికలంటే గుబులు మొదలైంది. అసలే అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఘెర పరాభవం తర్వాత వచ్చిపడిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా నెట్టుకురావాలో అర్థం కాని దుస్థితి నెలకొన్నది. ప్రజల్లో ఆశించిన స్పందన లేకపోవడంతోపాటు ఆర్థికంగా భారం పడుతుండటంతో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వెనుకడుగు వేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఒకే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత పూర్వ నల్లగొండ జిల్లా నల్లగొండ, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లాలుగా ఆవిర్భవించాయి. దీంతో మూడు రెవెన్యూ జిల్లాల ప్రకారం మూడు జిల్లా పరిషత్‌లు ఉండేలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
-యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార పార్టీలో ఆశావహుల జాతర సాగుతున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు పల్లెల్లో తీవ్ర పోటీ నెలకొన్నది. నువ్వా...నేనా..నీకా..నాకా అన్నట్లుగా టికెట్ల కోసం పోటీ మొదలైంది. జిల్లాలో స్థానిక సం స్థల ఎన్నికల కోసం ఇన్‌చార్జిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి ని, నియోజకవర్గాల్లో బాధ్యులుగా ఎమ్మెల్యేలను ని యమించడంతో పోటీదారులు టికెట్ల కోసం క్యూ క డుతున్నారు. మరోవైపు విపక్ష పార్టీల్లో స్థానిక సం స్థల ఎన్నికలంటే గుబులు మొదలైంది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఘెర పరాభవం తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా నెట్టుకురావలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ప్రజల్లో ఆశించిన స్పందన లేకపోవటం.. ఆర్థికంగా ఎన్నికల భారం కావటంతో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వెనకడుగు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ఒక జిల్లా పరిష త్ చైర్మన్ పదవి ఉండేది. జిల్లాల పునర్విభజన త ర్వాత పూర్వ నల్లగొండ జిల్లా నల్లగొండ, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లాలుగా ఆవిర్భవించా యి. దీంతో మూడు రెవెన్యూ జిల్లాల ప్రకారం మూ డు జిల్లా పరిషత్‌లు ఉండేలా ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17 మండలాలతో కొత్తగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేసింది. కొత్త గా ఏర్పడిన 17 గ్రామీణ మండలాలకు కూడా రెవె న్యూ మండలాల ప్రకారం ఇటీవల మండల పరిషత్‌లు ఉండేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈసీ, సర్కారు ఎన్నికలపై నజర్..
జిల్లా పరిషత్‌లకు జూలై 5 మండల పరిషత్‌లకు జూలై 4లోగా కొత్త పాలక వర్గాలు రావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో గడువులోపే ఎన్నికలు పూర్తి చేసి కొత్త పాలక వర్గాలు కొలువుదీరేలా ఈసీ, ప్రభుత్వం దృష్టి సారించాయి. చిన్న జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు కావటంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీ తీవ్రంగా ఉన్నది. జిల్లాలో 17 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే సగం మంది సభ్యుల మద్దతు అవసరం ఉండేది. తాజాగా ఇందులో మూడొంతుల మంది సభ్యుల మద్దతుంటే సరిపోవటంతో అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. అదీకాక కొత్త మండలాలు ఏర్పాటు చేయగా.. మండలాల విస్తీర్ణం కూడా తగ్గింది. దీంతో గ్రామాల సంఖ్య తగ్గడంతో జడ్పీటీసీ సభ్యునిగా గెలువటం కూడా సులభంగా మారింది.

పోటీకి ఆసక్తి..
ఎంపీపీ పదవులకు సంబంధించి.. గతంలో ఎక్కువ మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు కూడగట్టాల్సి వచ్చేది. 3,500 నుంచి 4వేల జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలు ఖరారు. చేయగా.. ఉమ్మడి జిల్లాలో వీటి సంఖ్య తగ్గింది. అయితే కొత్త మండలాలు ఏర్పాటు కావటంతో చాలా మండలాల్లో గ్రామ పంచాయతీలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. దీంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య కూడా తక్కువగానే ఉన్నది. మెజార్టీ మండలాల్లో 4-5 మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉంటే ఎంపీపీ పదవి కైవసం చేసేకునే అవకాశాలున్నాయి. దీంతో మూడు జిల్లాల్లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవులకు తీవ్రంగా పోటీ నెలకొంది. తాము పోటీ చేసే ఎంపీటీసీ స్థానంలో గెలిస్తే ఎంపీపీ అయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు జడ్పీటీసీ సభ్యునిగా గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకోవచ్చనే భావనతో పెద్ద సంఖ్యలో ఆశావహులు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నారు.

మద్దతు కోసం ప్రయత్నాలు..
ముఖ్యంగా అధికార పార్టీలోనే పోటాపోటీ నెలకొన్నది. ఇటీవల అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగడం.. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండటం సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో పూర్తి సానుకూలత ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అధికార పార్టీ నుంచి టికెట్ దక్కించుకుంటే తమ గెలుపు సగం ఖాయమైనట్టేనని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జిగా శాసనమండలిలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పార్టీ వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతలను అప్పగించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో ఆశావహులు అధికార పార్టీలో ఎక్కువగా ఉన్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని భావించి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి కనిపంచటం లేదు. ఇటీవల అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘెర పరాభవం చెందటం ప్రజల్లో ఆశించిన మేర అనుకూల స్పందన లేకపోవటంతో వెనకడుగు వేస్తున్నారు. అదీకాక ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆర్థికంగా భారం కావటం నిరాసక్తత కనిపిస్తున్నది. నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ నుంచి ఆర్థికంగా ఏమైనా వస్తే..ఇస్తే.. మాత్రమే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తున్నది.

రాజకీయ పోరు ప్రారంభం..
ప్రాదేశిక సమరం ప్రారంభమవడంతో మరోసారి గ్రామాల్లో రాజకీయ పోరుకు తెరలేచింది. పంచాయతీ ఎన్నికల తరహాలో కాకుండా పార్టీ గుర్తుపైనే ఈ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన పార్టీల నాయకుల మధ్య అప్పుడే పోటీ నెలకొన్నది. ఇటీవల ముగిసిన ఎంపీ ఎన్నికల్లో ప్రచారం గ్రామ స్థాయిలో ఊహించినంత లేకపోవడం ప్రజలు అంతగా ఆసక్తి చూపకపోవడంతో గతంతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం దాదాపు 10 శాతం మేర తగ్గింది. గ్రామస్థాయిలో తమ పట్టు నిరూపించుకునే ఎన్నికలు కావడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల నాటి ఉత్సాహం కనిపిస్తున్నది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ ముగియడంతో వారికి అనుకూలంగా ఉన్న స్థానాలపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకుల దృష్టి సారించారు. టీఆర్‌ఎస్ ఈ దఫా మెజార్టీ స్థానాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నది.

సమావేశాలు ప్రారంభం..
జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో కేసీఆర్ సూచనలను సఫలం చేసేందుకు జిల్లాలో నియోజకవర్గ సమావేశాలకు గురువారం శ్రీకారం పలికా రు. ఆలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం పె ద్ద ఎత్తున నిర్వహించారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ కార్యకర్తలకు దశ, దిశలను సూచించే ప్ర సంగం చేశారు. 17 జడ్పీలు, 1 మండల పరిషత్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆలే రు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి స్వగ్రామమైన వంగపల్లిలో నిర్వహించిన నియోజకవర్గ స మావేశం ఉత్సాహం.. ఉల్లాసాన్ని ఇచ్చింది. సునీతామహేందర్‌రెడ్డిల నాయకత్వంలో నియోజవర్గంలోని అన్ని సీట్లు గెలువడమే లక్ష్యంగా పని చేస్తామ ని నాయకులు ధృడనిశ్చయం తీసుకున్నారు. పల్లె ల్లో ఎంతో కీలకమైన ఎన్నికలు కావడంతో ప్రతిష్టగా తీసుకుంటామని టీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...