ఎంజీయూ అకాడమిక్ సెనెట్ కమిటీ సమావేశంలో సుదీర్ఘ చర్చ


Thu,April 18, 2019 11:18 PM

ఎంజీయూనివర్సిటీ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఐదో అకాడమిక్ సెనెట్ కమిటీ సమావేశం గురువారం నల్లగొండలోని ఎంజీయూ ఆర్ట్స్‌బ్లాక్ మినీ సమావేశ మందిరంలో యూనివర్సిటీ వీసీ ప్రొ॥ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది. ఉదయం 1.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశం సుదీర్ఘ చర్చతో సాగింది. సెనెట్ సమావేశానికి హాజరైన వివిధ యూనివర్సిటీల ఆ కమిటీ సభ్యులు, ఎంజీయూ ఉమ్మడి జిల్లా పరిధిలోని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు యూనివర్సిటీ అభివృద్ధితో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అమలుకు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు తదితర అంశాలను వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వివరించారు. యూనివర్సిటీ ప్రారంభంలో పని చేసిన వీసీ ప్రొ॥ గంగాధర్ ఆ తర్వాత పని చేసిన వీసీ ప్రొ॥ కట్టా నర్సింహారెడ్డి యూనివర్సిటీకి చేసిన సేవలను తెలిపారు.

ఆ తర్వాత 2016లో తాను వీసీగా వచ్చిన తర్వాత యూనివర్సిటీని అభివృద్ధి చేసిన విషయాలను వివరించారు. రాష్ట్రంలోనే ఎంజీయూను రోల్డు మోడల్‌గా తీర్చిదిద్దామని ఏ యూనివర్సిటీలో అమలు చేయని బయోమెట్రిక్ అటెండెన్స్‌ను ఎంజీయూలో విద్యార్థులకు, అధ్యాపకులకు అమలు చేసి సత్ఫలితాలు పొందామన్నారు. సీబీసీఎస్ విధానంలో డిగ్రీ ఫలితాలు, విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. రూ.2 కోట్లతో అత్యాధునిక ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్నియూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్, విద్యార్థుల సహకారంతో మొక్కలు నాటి రాష్ట్రంలోనే హరితమిత్ర అవార్డును అందుకోవడంతోపాటు రూ.15 లక్షల నగదు బహుమతి పొందామన్నారు. ఎంజీయూలో అభివృద్ధికి ప్రభుత్వం నుంచి రూ.40 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్టు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంజీయూలోని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పని చేసే వారితో పాటు అందరూ అధ్యాపకుల మంతా సమిష్ట్టిగా పని చేస్తూ యూనివర్సిటీని రాష్ట్రంలోనే ప్రథమంగా ఉంచడంతో పాటు విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ॥ ఎం.యాదగిరి, సెనెట్ కమిటీ సభ్యులు ఓయూ ప్రొపెసర్లు మధుమతి, ద్వారకానాథ్, సభ్యులు గజలా యాస్మిన్, కొప్పుల అంజిరెడ్డి, డా. అల్వాల రవి, డా. బి. ధర్మానాయక్, ఎన్జీ కాలేజ్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. దోమల రమేశ్, సీవోఈ మిర్యాల రమేశ్, ఎఫ్‌వో బ్రహ్మచారి, ఎంజీయూ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...