యాదాద్రిలో భక్తుల కోలాహలం


Thu,April 18, 2019 11:17 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ శాస్ర్తోక్తంగా నిత్య పూజలు కోలాహలంగా కొనసాగాయి. గురువారం ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన శ్రీస్వామి అమ్మవార్లలకు హారతి నివేదన జరిపారు. ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చన చేశారు. స్వర్ణపుష్పార్చన దర్శనమూర్తులను అర్పించారు. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం, అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. రామలిం గేశ్వరాలయంలో మహాశివుడిని ఆరాధిస్తూ అభిషేకం, అర్చన చేపట్టారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణీ చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.

ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వత్ర పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ. 60,000ల ఆదాయం సమకూరింది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు.

శ్రీవారి ఖజానాకు రూ. 6,74,170 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 6,74,170 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 54,210, 100 రూపాయల టికెట్‌తో రూ.45,600 కల్యాణకట్ట ద్వారా రూ. 24,200 గదులు విచారణ శాఖతో రూ. 70,300 ప్రసాదవిక్రయాలతో రూ. 2, 94, 005 శాశ్వత పూజలతో రూ.22,116 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...