యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి


Thu,April 18, 2019 11:17 PM

భువనగిరిరూరల్ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నందున యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కోరారు. హైదరాబాదులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో గురువారం సమావేశమైనారు. రిటర్నింగ్ అధికారులు, సహా య రిటర్నింగ్ అధికారులకు వెంటనే శిక్షణ పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు పూర్థి స్థాయిలో సన్నద్ధం చేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాలను అన్ని వసతులతో సిద్ధం చేసి వివరాలను రాజకీయ పార్టీలకు అందజేయాలని కోరారు. నిర్దేశించిన సాఫ్ట్‌వేర్‌లో పోలింగ్ కేంద్రాల వివరాలు అప్లోడ్ చేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. ఎన్నికలకు సరి పడ బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసుకోవాలని, సమయం తక్కువగా ఉన్నందున బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ఇప్పటి నుంచే ప్రింటర్లతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. పోలింగ్ నిర్వహణ విషయంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా సెక్యూరిటీ ప్లాను రూపొందించుకొని పోలీసు బందోబస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లకు, పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. రిసెప్షన్, డిస్టిబ్యూషన్ సెంటర్లు, స్రాంగ్ రూములు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ అనితా రామచద్రన్ మాట్లాడుతూ ఇప్పటికే పీవో, ఏపీవోలను నియమించి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్లు వివరించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...