రైతన్నకు మద్దతు


Wed,April 17, 2019 11:28 PM

- ఏ గ్రేడ్‌కు రూ.1,770, బీ గ్రేడ్‌కు రూ.1750
- జిల్లాకు 148 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు
- ఇప్పటికే 129 కేంద్రాలు ప్రారంభం
- 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
- అందుబాటులో 30లక్షల గన్నీసంచులు

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ : యాసంగి పంట చేతికి వస్తుండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు మొత్తం 148 కొనుగోలు కేంద్రాలు మంజూరు కాగా ఇప్పటికే 129 కేంద్రాలు ప్రారంభించారు. మిగతా వాటిని పలు విడుతలుగా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 1,770, బీ గ్రేడ్‌కు రూ.1750 మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచుతున్నారు. 30 లక్షల గన్నీ సంచులు అందుబాటులో ఉండగా మరో 25 లక్షలు రానున్నాయి. ఈ నెల 10న ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు జూలై 10 వరకు కొనసాగుతాయి. కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా తాగునీరు, నీడ సాకర్యం కల్పిస్తున్నారు.

యాసంగి పంట చేతికి వస్తుండటంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు మొత్తం 148 కొనుగోలు కేంద్రాలు మంజూరు కాగా ఇప్పటికే 129 కేంద్రాలు ప్రారంభించారు. మిగాతా వాటిని పలుదఫాలుగా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,770, బీ గ్రేడ్‌కు రూ.1750 మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మేర గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచుతున్నారు. 30 లక్షల గన్నీ సంచులు అందుబాటులో ఉండగా మరో 25 లక్షల గన్నీ సంచులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 10న ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు జూలై 10 వరకు కొనసాగుతాయి. కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా తాగునీరు, నీడ సాకర్యం కల్పిస్తున్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర అందించి ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. వానాకాలంలో 77,705 మంది రైతుల నుంచి 3 లక్షల 59వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ధాన్యం విక్రయించిన రైతులకు రూ.302 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడు యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 2, 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే లక్ష్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

రైతుకు అండగా సర్కార్..
తెలంగాణ సర్కార్ రైతన్నకు అండగా నిలుస్తున్నది. వరి నారు పోసిన నాటి నుంచి పంట చేతికొచ్చేంత వరకు అన్ని రకాలుగా రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నది. నాటుకునే విత్తనాన్ని అందిస్తూనే పంట వేసుకోవడానికి పెట్టుబడి సాయం అందిస్తున్నది. పంట కోత దశకు వచ్చిన వెంటనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లిస్తున్నది.

రైతులకు ఇబ్బందులు రాకుండా..
జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు వసతి కల్పిస్తున్నారు. కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.

యాసంగిలో 83, 497 ఎకరాల్లో సాగు..
జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం అంచనాలు 83, 497ఎకరాలు కాగా ఈ సారి సీజన్‌లో వానాకాలం కన్నా అధికంగా ధాన్యం వస్తుందని అంచనా చేస్తున్నారు. వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఈ యాసంగి సీజన్‌లో 1, 30, 135 ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. వానాకాలంలో సమృద్ధిగా వానలు పడకపోవడంతో పలుచోట్ల సాగునీటి కొరత ఉంటుందన్న ఆందోళనతో రైతులు వెనుకడుగువేశారు. మొత్తం సాగు భూమిలో సగానికే పంటలు సాగు చేయడంతో గతేడాది సాగుతో పోలిస్తే ఈ సారి సాగు విస్తీర్ణం తగ్గింది. సరిగ్గా ఏడాది కిందట యాసంగి సీజన్‌లో 2,39,627 ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సాగైన విభిన్న పంటల్లో వరి సాగుకే చాలా మంది మొగ్గు చూపారు. సాగు విస్తీర్ణం మేరకు జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 2,50, 000 లక్షల టన్నుల మేర ధాన్యం రావొచ్చని అధికారులు చెబుతున్నారు.

ధాన్యం సేకరణకు మందస్తు కసరత్తు..
జేసీ రమేశ్ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ కోసం ముందస్తుగానే కసరత్తును ప్రారంభించారు. ఏప్రిల్ 10 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కావడానికి ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేసే బాధ్యతలను జిల్లా పౌరసరఫరాల శాఖ తీసుకున్నది. జేసీ రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశానికి డీఆర్‌డీఏ పీడీ మందడి ఉంపేందర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సంధ్యారాణి, ఆర్‌డీవోలు వెంకటేశ్వర్లు, సూరజ్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి సారిక, పౌరాసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎం.గోపికృష్ణ పాల్గొని చేపట్టాల్సిన కార్యాచరణపై తగిన వ్యూహం తయారు చేసిన ప్రణాళికలను అమలు చేస్తున్నారు.

ఇబ్బందులు తెలత్తకుండా చర్యలు..
యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం. కాంటాలు ఏర్పాటు చేసే చోట వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, నీడ కోసం టెంటు ఏర్పాటు చేయాలని సూచించాం. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దు. యాసంగి సీజన్‌లో ధాన్యం దిగుబడులు 2, 50, 000 టన్నుల మేర వచ్చేవీలుందని వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారి అంచనాలను అనుసరించి జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నాం.
-ఎం.గోపికృష్ణ, జిల్లా పౌరసఫరాల శాఖ మేనేజర్

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...