ఎల్‌డీఎస్ చారిటీస్ సేవలు అభినందనీయం


Wed,April 17, 2019 11:21 PM

ఆత్మకూరు(ఎం) : గ్రామాల్లోని పేదలందరికీ స్వచ్ఛమైన తాగునీరును అందించేందుకు ఎల్‌డీఎస్ చారిటీస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. హిల్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో.. ఎల్‌డీఎస్ చారిటీస్ సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని రాయిపల్లి, లింగరాజుపల్లి, పల్లెర్ల, ఖఫ్రాయిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాలను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ భాగస్వాములై నీటి శుద్ధి కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. త్వరలో నియోజకవర్గంలోని వికలాంగులకు హిల్ స్వచ్ఛంద సంస్థ, ఎల్‌డీఎస్ చారిటీస్ సంస్థ ఆధ్వర్యంలో రూ.40 వేల విలువైన వీల్ చైర్లను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎస్ చారిటీస్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి శేఖర్, అధ్యక్షుడు జాన్‌దిట్టు, మెకానిక్ మనోహర్, ఎంపీపీ కాంబోజు భాగ్యశ్రీభానుప్రకాశ్, ఎంపీటీసీ మేడి లక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నాయిని నర్సింహారెడ్డి, సుమతి, వరలక్ష్మి పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...