దళితరత్న అవార్డుల ప్రదానం


Tue,April 16, 2019 11:25 PM

మోత్కూరు : రాష్ట్ర ప్రభుత్వం తనకు దళితరత్న అవార్డును ప్రదానం చేసిందని మోత్కూరు టీ ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు చెడుపల్లి రఘుపతి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. దళితుల హక్కులు, సమస్యలపై తాను అందించిన సేవలకు గానూ అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ జయంతిలను పురస్కరించుకొని ఆదివారం హైదారాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తనకు అవార్డును ప్రదానం చేశారని తెలిపారు. అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ జున్న కనుకురాజు చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. తనకు ఈ అవార్డు రావడానికి కృషి చేసిన వారందరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆత్మకూరు(ఎం) : అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని రాఘవాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వెంకన్న, పల్లెర్ల గ్రామానికి చెందిన మేడి శ్రీను, దళిత యువరత్న అవార్డులను అందుకున్నారు. సామాజిక సేవతోపాటు అంబేద్కర్ ఆశయాలకు అనుగునంగా పాటుపడినందుకు టీఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, మాజీ ఐఏఎస్ అధికారి రాంలక్ష్మణ్ చేతులమీదుగా అవార్డులను అందుకున్నారు. అవార్డులు అందుకున్న వెంకన్న, శ్రీనును ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...