వంద శాతం విద్యుత్ బిల్లులు వసూలు చేయాలి


Tue,April 16, 2019 11:25 PM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : విద్యుత్ బిల్లులను నూటికి నూరు శాతం వసూలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. ట్రాన్స్‌కో సమావేశ మందిరంలో సోమవారం విద్యుత్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో దేవరకొండ, నాంపల్లి ప్రాంతాల్లో విద్యుత్ బిల్లులు చాలా వరకు వెనుకబడి ఉన్నాయని వాటిని నూటికి నూరు శాతం వసూలు చేయకపోతే అధికారులకు ఇంక్రిమెంట్ కట్ చేస్తామన్నారు. ఎండలు అధికంగా ఉండడంతో విద్యుత్ వాడకంరోజు రోజుకు పెరుగుతుందన్నారు. వే సవి కాలంలో ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నెలకొరిగే పరిస్థితి ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. బిల్లుల వసూలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, రాములు, స్వామిరెడ్డి, మోహన్‌రావు, పాండ్యనాయక్, ఎస్‌ఈ కృష్ణయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...