భూ తగాదాలు శాంతిభద్రతల సమస్యగా మారకుండా చర్యలు


Tue,April 16, 2019 11:24 PM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : భూ తగాదాలు శాంతి భద్రతల సమస్యగా మారకుండా అన్ని రకాలుగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే సందర్భంగా ఆయన పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారంపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యల విషయంలో రెవెన్యూ అధికారులను భాగస్వామ్యం చేయడం ద్వారా పరిష్కారమయ్యే విధంగా చూడాలని, భూ తగాదాలు ఎట్టి పరిస్థితులలో శాంతిభద్రతల సమస్యగా మారకుండా జాగ్రత్తలు వహించాలని పోలీసులకు సూచించారు. ఫిర్యాదుల విభాగాన్ని మరింత సమర్థవంతంగా పటిష్టపరిచే విధంగా సీఐ స్థాయి అధికారిని నియమించి ప్రతి ఫిర్యాదును కంప్యూటర్‌లో భద్రపరచడం, ఆ సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం, అవసరమైతే బాధితులతో ఫోన్‌లో నేరుగా సంప్రదించి పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఫిర్యాదులపై స్పందించని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. 24 మంది సమస్యల పరిష్కారానికై ఎస్పీకి ఫిర్యాదులు అందజేశారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...