ఘనంగా సీతారాముల కల్యాణం


Mon,April 15, 2019 12:13 AM

భూదాన్‌పోచంపల్లి : మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపున్నారు. మండల పరిధిలోని శివారెడ్డిగూడెం, ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో నిర్వహించిన స్వామివారి కల్యాణంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. జలాల్‌పూర్‌లో శనివారం రాత్రి నిర్వహించిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సతీమణి పైళ్ల వనిత పాల్గొని స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. పెద్దగూడెంలో మాడ్గుల యాదిరెడ్డి-భారతమ్మల ఆధ్వర్యంలో వేడుకల్లో జడ్పీటీసీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొని అన్నదానం చేశారు.ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సామ రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు మన్నె పద్మారెడ్డి, గోడళ్ల ప్రభాకర్‌గౌడ్, పీసర్ల మంజుల మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ మాడ్గుల బాలమణి, నాయకులు కందాడి భూపాల్‌రెడ్డి, ఆర్ల లింగస్వామి, ఏర్పుల జంగయ్య, రాగీరు సత్యనారాయణగౌడ్, సుకరి రవి, ఆర్ల వెంకటేశంయాదవ్, కాసుల బాల్‌రాజు, దేవేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, సుధాకర్‌రెడ్డి, దానయ్య పాల్గొన్నారు. మడంల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో జరిగిన కల్యాణోత్సవంలో దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చంద్రయ్య, మాజీ సర్పంచ్ తడక లత, ధరకర్తలు నర్సింహ, కృష్ణయాదవ్, లలిత, యాదగిరి, మల్లేశంగౌడ్, నర్సింహగౌడ్, రుద్ర నర్సింహ, భోగ రఘు తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...