అంబేద్కర్ దళిత ఆత్మ గౌరవ శిఖరం


Mon,April 15, 2019 12:13 AM

మోటకొండూర్: బాబా సాహెబ్ అంబేద్కర్ దళిత ఆత్మగౌరవ శిఖరమని, ఆయన ఆశయాలు కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మోటకొండూర్ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత అన్నారు. అంబేద్కర్ 128వ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాల్ గడ్డ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు అంబేద్కర్ విధానమే ఏకైక మార్గమన్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్, యాత్ర సంస్థ డైరక్టర్ సుర్పంగ శివలింగం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, రేగు సిద్దయ్య, ఎగ్గిడి కృష్ణకుర్మ, బొట్ల శంకర్, సుర్పంగ శ్రీనివాస్ పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...