మహనీయుడు అంబేద్కర్


Mon,April 15, 2019 12:13 AM

భువనగిరి అర్బన్ : భారత రాజ్యాంగ సంస్కరణల ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక వినాయక చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కలెక్టర్ అనితారామచంద్రన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ నువ్వుల ప్రసన్న, వైస్ చైర్‌పర్సన్ మహలక్ష్మి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కౌన్సిలర్లు రాచమల్ల రమేశ్, అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పలు పార్టీల నాయకులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. విద్యుత్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు నక్కల చిరంజీవి, ఎర్రవెల్లి మధు, కృష్ణానంద్‌మోహన్, కంచనపల్లి నర్సింగ్‌రావు, ఎండీ అజార్, ఖాజం, ఆలిక్, రహమన్, విద్యుత్ అధికారులు జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.వెంకన్న, భువనగిరి డివిజన్ ఇంజినీర్ కృష్ణ, ఎస్సీ, ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, రాజేశ్వర్, బీసీ సంఘం అధ్యక్షుడు బొబ్బిలి మురళి, 1104 సంఘం అధ్యక్షుడు యాదగిరి, ఉద్యోగులు భాస్కర్, శ్రీనివాస్, కృష్ణ, జైపాల్, యాదగిరి, భిక్షపతి, రాములు, హరినాథ్, జంగయ్య, రవికుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...