అంబేద్కర్ ఆదర్శప్రాయుడు


Mon,April 15, 2019 12:12 AM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ ఆదర్శప్రాయుడని శాఖ గ్రంథాలయం చైర్మన్ ఊడుగు మల్లేశ్‌గౌడ్ పేర్కొన్నారు. శాఖ గ్రంథాలయంలో ఆదివారం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బొంగు జంగయ్యగౌడ్, ముత్యాల భూపాల్‌రెడ్డి, సుర్కంటి మహేందర్‌రెడ్డి, చిరందాసు ధనుంజయ్య, మంచికంటి భాస్కర్‌గుప్తా, ఖలీల్, గోశిక రవి, బొబ్బిళ్ల శ్రీనివాస్, సిలువేరు కృష్ణ, గోశిక నర్సింహ పాల్గొన్నారు.

చౌటుప్పల్ రూరల్ : దేవలమ్మనాగారం, దండుమల్కాపురం, మందోళ్లగూడెం, దామెర, పీపల్‌పహాడ్‌ల్లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, ఎలువర్తి యాదగిరి, బూర్గు చంద్రకళ, నారెడ్డి అండాలు, చీరిక రాణి, ఎంపీటీసీలు బూర్గు కృష్ణారెడ్డి, మల్కాపురం నర్సింహ, కొండా యాదగిరి, ఉపసర్పంచ్‌లు నిమ్మల మమత, కొండ హారిక, మల్కాజిగిరి బాబు పాల్గొన్నారు.
అడ్డగూడూరు : అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలకేంద్రం, చౌళ్లరామారం, ధర్మారం, కంచనపల్లి, బొడ్డుగూడెం గ్రామాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు . ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్ మాట్లాడారు.కార్యక్రమంలో ఎంపీపీ ఓర్సు లక్ష్మి , టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పొన్నాల వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి,ఎంపీటీసీ పూలపల్లి జనార్దన్‌రెడ్డి, సర్పంచ్‌లు త్రివేణి, ఇటికాల కుమార్‌స్వామి, ఉపసర్పంచ్ వడకాల రణధీర్‌రెడ్డి, ఓర్సు పురుషోత్తం, చేడే చంద్రయ్య, కిరణ్, మహేశ్, వడకాల రాంరెడ్డి పాల్గొన్నారు.

రామన్నపేట : అంబేద్కర్ జయంతి సందర్భంగా శిరీష, ఎడ్ల మహేందర్‌రెడ్డి, మెట్టు మహేందర్‌రెడ్డి, కాల్య యామిని, ప్రకాశ్, అంతటి పద్మ అంబేద్కర్ ఆశయాలు సాధించాలని సర్పంచ్‌లు పిలుపునిచ్చారు. పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోదాసు శిరీషాపృథ్వీరాజ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగకర్తని మహనీయుల మార్గంలో యువత నడవాలని ఆమె తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...