ఓటెత్తిన పురుషులు


Sat,April 13, 2019 11:57 PM

- మహిళల కంటే అధికంగా నమోదు
- అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 90. 54
- భువనగిరి పార్లమెంట్ ఓటింగ్ శాతం 74. 39
- రాష్ట్రంలోనే రెండోస్థానం

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ : అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివెరిసింది. మహిళల కంటే అధికంగా పురుషులు ఓట్లు వేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆలేరు నియోజకవర్గంలో 80.40, భువనగిరి నియోజకవర్గంలో 81.61 శాతం ఓటింగ్ నమోదైంది. మిగతా నియోజకవర్గాల వారీగా చూస్తే ఇబ్రహీంపట్నం 66.90, మునుగోడులో 78. 03, నకిరేకల్ 75. 95, తుంగతుర్తిలో 72.22, జనగామలో 68. 26 శాతం ఓటింగ్ నమోదైంది. ఆలేరు, భువనగిరిలో ఓటింగ్ కొంతశాతం అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 16, 27, 527 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 6, 16, 392, మహిళా ఓటర్లు 5,94,391 మంది ఓటువేశారు. గత డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లో సైతం పురుఘలే అధికంగా ఓటును వినియోగించుకున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు స్పందించినప్పటికీ పట్టణాల్లో అంతగా ముందుకు రాలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ పోల్స్‌లో పురుఘలు ఓటెత్తారు. మహిళల కంటే అధికంగా ఓట్లు వేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆలేరు నియోజకవర్గంలో 80.40 ఓటింగ్ శాతం నమోదైంది. భువనగిరి నియోజకవర్గంలో 81.61 శాతం ఓటింగ్ నమోదైంది. మిగతా నియోజకవర్గాల వారీగా చూస్తే ఇబ్రహీంపట్నం 66.90, మునుగోడు 78. 03, నకిరేకల్ 75.95 తుంగతుర్తి 72.22 శాతం, జనగామ 68.26 శాతం నమోదైంది. ఆలేరు, భువనగిరిల్లో ఓటింగ్ కొంత శాతం అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గింది. పట్టణ ఓటర్లు ఎప్పటిలాగే నిరాసక్తతను ప్రదర్శించగా.. పల్లె ఓటర్లు తమ ఓటు చైతన్యాన్ని ప్రదర్శించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పురుషులు ఓటెత్తారు. గత డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లో సైతం పురుషులే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పల్లెల్లో ఓటర్ల చైతన్యం కొనసాగించగా పట్టణాల్లో ఓటరు స్పందించలేదు. అందువల్ల ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కొంత శాతం తగ్గింది. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు స్పందించినప్పటికీ పట్టణాల్లో ముందుకు రాలేదు.

అయితే పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం, సమయానికి పోలింగ్ ప్రారంభం కాకపోవడం ఒక కారణంగా చెబుతున్నారు. ఎండకాలం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో వేడిమికి ఓటరన్న బయటకు రాలేదని మరో వాదన వినిపిస్తున్నది. కొన్ని చోట్ల ఓట్లు గల్లంతైనట్టు విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా గత డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూసినట్లయితే పోలింగ్ శాతం పడిపోయింది. ఆనాడు జిల్లా వ్యాప్తంగా 84.10 శాతం పోలింగ్ నమోదైతే, తాజాగా గురువారం జరిగిన ఎన్నికల్లో 74.39 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఓటుపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి తోడు ఈసారి కొత్త ఓటర్లు కూడా వచ్చారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఓటు వేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. అందువల్లే అంతమాత్రమైనా పెరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పట్టణాలతో పోల్చి చూస్తే పల్లె జనం ఓటు వేయడంలో ముందున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 16,27,527 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 12, 10,785 మంది పురుషులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో పురుష ఓటర్లు 6,16,392 కాగా.. మహిళా ఓటర్లు 5,94,391 కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మహిళల కన్నా పురుషులు ఓటింగ్‌లో అధికంగా పాల్గొన్నారని తేటతెల్లం అవుతున్నది.

ఓటింగ్‌లో పురుషులదే అధిక్యం..
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన విషయం విధితమే. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 74.39 శాతం పోలింగ్ నమోదైయింది. మొత్తం 16,27,527 ఓటర్లు ఉండగా.. 12,10,785 ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,18,123 ఓట్లు ఉండగా.. 1,53,501 ఓట్లు నమోదు అయ్యాయి. ఇందులో పురుషులు 89,505, స్త్రీలు 85,870 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. 80.40 ఓటింగ్ శాతంగా నమోదైంది. నకిరేకల్ నియోజకవర్గంలో 75.95 శాతం నమోదైయింది. మొత్తం 2,36,221 ఉండగా.. పురుషులు 1,18,139 మంది, స్త్రీలు 1,18,081 ముంది ఉన్నారు. ఇందులో మొత్తం 1,79,410 మంది ఓటును వినియోగించుకోగా.. పురుషులు 90,355, మహిళలు 89,055 ఓట్లు వేశారు. ఇక తుంగుతుర్తి నియోజకవర్గంలో 72.22 శాతం పోల్ కాగా మొత్తం 2,39,558 ఉండగా.. 1,73,011 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో పురుషులు 87,517, స్త్రీలు 85,494 మంది ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 78.03 శాతం పోల్ కాగా మొత్తం 2,30,161 మంది ఓటర్లు ఉండగా 1,79,605 ఓటర్లు తమ ఓటును వినియోగించుకోగా ఇందులో పురుషులు 92,170, స్త్రీలు 87,435 మంది ఉన్నారు. భువనగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 81.61 శాతం పోల్ కాగా మొత్తం 2,02,028 మంది ఉండగా ఇందులో 1,64,884 ఓటర్లు తమ ఓటును వినియోగించుకోగా ఇందులో పురుషులు 84,014, స్త్రీలు 80,870 మంది ఉన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అత్యల్పంగా 66.90 శాతం పోల్ కాగా మొత్తం 2,76,549 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,84,999 మంది తమ ఓటును వినియోగించుకోగా ఇందులో పురుషులు 95,943, స్త్రీలు 89,054 మంది ఉన్నారు. జనగామ నియోజకవర్గంలో 68.26 శాతం పోల్ కాగా మొత్తం 2,24,887 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,53,501 మంది తమ ఓటును వినియోగించుకోగా ఇందులో పురుషులు 76,888, స్త్రీలు 76,613 మంది ఉన్నారు. ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో ఈ దఫా అధికంగా పురుష ఓటర్లు ఉండటం ఎవరికి లాభం చేకూరుస్తుందన్నది చర్చానీయాంశంగా మారింది. పురుష ఓటర్ల తీర్పు ఈసారి అత్యంత కీలకం కానుంది.

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ వివరాలు..
జిల్లాలోని అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన 90.54 శాతం పోలింగ్ శాతం నమోదైంది. భువనగిరిలో 89.90 శాతం ఓటింగ్ నమోదైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరిలో 84.97శాతం పోలింగ్ జరుగగా ఈ సారి దాన్ని అధిగమించింది. అదే విధంగా ఆలేరులో కూడా గత (2014 అసెంబ్లీ) ఎన్నికల్లో 86.10 శాతం పోలింగ్ జరుగగా ఇప్పుడు రికార్డు స్థాయిలో 91. 17 జరిగింది. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతంగా నమోదు కావడం పట్ల అధికారులు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు అప్పట్లో హర్షం వ్యక్తం చేశారు. భారీ పోలింగ్‌తో అభ్యర్థుల గుండెల్లో గుబులు పట్టుకుంది. జిల్లాలో మొత్తం 4,00,077 మంది ఓటర్లు ఉన్నారు. ఆలేరులో 2,09,266 ఓటర్లకుగాను 1,90,787 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా భువనగిరిలో 1,90,812 మంది ఓటర్లకుగాను 1,71,540 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఆలేరు నియోజకవర్గంలో 91.17 అత్యధిక ఓటింగ్ నమోదయింది. భువనగిరిలో 89.90 శాతం ఓటింగ్ నమోదయింది. ఆలేరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 91.17 పోలింగ్ శాతం నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 2,09,266 మంది ఓటర్లు ఉండగా 1,90,786 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 1,05,207, మహిళలు 1,04, 040 ఓట్లు పోలయ్యాయి.

లోక్‌సభకు తగ్గిన పోలింగ్..
గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినట్లయితే లోక్‌సభ పోలింగ్ శాతం భారీగానే తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో 90 54 శాతం పోలింగ్ నమోదైతే తాజా ఎన్నికల్లో 74.39 శాతానికి పడిపోయింది. గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా వారీగా, నియోజకవర్గాల వారీగా లెక్కించినప్పుడు స్వల్ప తేడాలు చోటు చేసుకున్నాయి. జిల్లాల వారీగా చూసినప్పుడు ఆలేరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శాతం 90.54 కాగా పార్లమెంట్ ఎన్నికల శాతం కేవలం 74.39 శాతం నమోదయింది. నియోజకవర్గంలోని మండలాల వారీగా పోలింగ్ సరళిని చూసినప్పుడు మార్పులు స్పష్టంగా కనిపించాయి.

పల్లెల్లో కొనసాగిన ఓటు చైతన్యం..
శాసనసభ ఎన్నికల్లో పల్లె ఓటరు చూపిన ఉత్సాహం లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగింది. ఎండల తీవ్రత వరుస సెలవులు, ఎన్నికలు కేంద్రానికి సంబంధించిన అంశంగా చూడటం వంటి పలు కారణాలతో పట్టణ వాసులు ఓటింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా మొన్నటి ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పోలింగ్ కేంద్రాలు పెరిగినా పోలింగ్ 10 శాతం వరకు తగ్గింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మునుపటి ఓటు చైతన్యం వెల్లువెత్తింది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 270 పోలింగ్ కేంద్రాలకుగానూ 58 కేంద్రాల్లో 90 శాతం పైగా పోలింగ్ నమోదుకాగా పార్లమెంట్ ఎన్నికల్లో పల్లెల్లో 80 శాతం దాటితే పట్టణంలో మాత్రం ఓటింగ్ శాతం 70 శాతంలోపే నమోదైంది.

విద్యావంతులు, మేధావులు ఎక్కువగా ఉన్న భువనగిరి, ఆలేరు వంటి పట్టణ కేంద్రాల్లో ఓటింగ్ శాతం గతంలో కంటే తగ్గింది. పల్లె పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోపే ఓటేసేందుకు ఉత్సాహం చూపగా ఈసారి వృద్ధులు, మహిళలు, లబ్ధిదారులు మునుపటి ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లిన వారిలో చాలామంది స్వగ్రామాల్లో ఓటరుగా నమోదై ఉన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులై ఉన్న వీరంతా గ్రామాల్లో ఆధార్‌కార్డు తీసుకొని ఓటరుగా నమోదై ఉండి ఓటు హక్కు కోసం ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా అసెంబ్లీ ఎన్నికల్లో పల్లెలకు తరలి వచ్చిన వారు కూడా ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే గ్రామీణ ప్రాంతంలో రైతులు, ఆసరా పింఛన్‌తోపాటు పలు సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు, దివ్యాంగులు పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనడం వారంతా టీఆర్‌ఎస్‌కు అనుకూల ఓటర్లు కావడం భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో వీరి తీర్పు కీలకం కానుంది.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...